- జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు గడువు కోరిన ఈడీ
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలు చేయడానికి ఈడీ గడువు కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- badvelu by election: రేపు బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల: కలెక్టర్ విజయరామరాజు
రేపు బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల(badvelu by election notification) చేయనున్నట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరిస్తామన్నారు. ఈ మేరకు కడప ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వంచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ministers Committee: గృహ రుణాల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకంపై మంత్రుల కమిటీ భేటీ
గృహ రుణాల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం అమలుకు నియమించిన మంత్రుల కమిటీ తొలిసారిగా భేటీ అయింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు తీసుకున్న రుణాల చెల్లింపునకు ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,010 కరోనా కేసులు, 13 మరణాలు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58,054 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,010 మంది కొవిడ్ బారిన పడ్డారు. 13 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,149 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Bhabanipur bypoll: ప్రశాంతంగా భవానీపుర్ పోలింగ్
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బరిలో ఉన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోరు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ అంతా ప్రశాంతంగానే జరిగినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్‌కు గుడ్‌బై.. భాజపాలో మాత్రం చేరను: అమరీందర్
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఊహించినట్లుగానే పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే భాజపాలో చేరట్లేదని, కాంగ్రెస్‌ను మాత్రం కచ్చితంగా వీడతానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- China Help Afghanistan: అఫ్గానిస్థాన్‌కు చైనా భారీ సాయం
అఫ్గాన్ ప్రజల కోసం 31 మిలియన్ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని అందజేసింది చైనా(China Help Afghanistan). ఇందులో భాగంగా దుప్పట్లు, జాకెట్లు వంటివి ఆ దేశానికి సరఫరా చేసింది. రానున్న రోజుల్లో మరింత సాయాన్ని తాము అఫ్గాన్‌కు అందేజేస్తామని చెప్పింది. మరోవైపు.. రానున్న నెలల్లో భారీ మానవతా సంక్షోభ ముప్పును అఫ్గాన్ ఎదుర్కోనుందని 'రెడ్ క్రాస్' సంస్థ హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అక్టోబర్ అలర్ట్.. ఒకటో తేదీ నుంచి వచ్చే మార్పులు ఇవే..
ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆటో డెబిట్, నిరుపయోగంగా మారనున్న పలు బ్యాంక్‌ల చెక్‌బుక్‌లు, పోస్టాఫీస్ ఛార్జీలు సహా పలు ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి. వాటన్నింటి పూర్తి వివరాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి
ప్రముఖ నటి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి గల కారణాన్ని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా కోచ్‌గా ద్రవిడ్, మెంటార్‌గా ధోనీ.. ఇదే జరిగితే
రవిశాస్త్రి(ravi shastri news) తర్వాత టీమ్ఇండియాకు కోచ్‌గా ఎవరు ఎంపికవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ స్థానంలో ధోనీ, ద్రవిడ్(rahul dravid news) తమ సేవలందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై స్పందించాడు భారత జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.