ETV Bharat / city

ప్రధాన వార్తలు@7 PM

.

ప్రధాన వార్తలు@7 PM
ప్రధాన వార్తలు@7 PM
author img

By

Published : May 2, 2021, 7:00 PM IST

1. సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణపై హైకోర్టు అభిప్రాయం, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి స్పష్టమైన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులపై గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,70,584 ఓట్ల ఆధిక్యం సాధించారు. లెక్కించాల్సిన ఓట్ల కంటే గురుమూర్తి ఆధిక్యం ఎక్కువగా ఉంది. తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మూడో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. 'నేను లోకల్​' నినాదంతో మమత తీన్మార్​

బంగాల్​లో తృణమూల్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్​ కొట్టింది. ఈ ఎన్నికలు బంగాల్​ ఆత్మగౌరవానికి, బయటి వ్యక్తులకు మధ్యే అని చెప్పిన సీఎం మమతా బెనర్జీకే ఆ రాష్ట్ర​ ప్రజలు పట్టంగట్టారు. నందిగ్రామ్​ నుంచి పోటీ చేసిన దీదీ ఓడినప్పటికీ.. బంగాల్​ వ్యాప్తంగా తృణమూల్ హవా కొనసాగింది. ఈ విజయానికి కారణాలేంటి ? మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని టీఎంసీ చారిత్రక విజయం ఎలా సాధించింది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. 'నందిగ్రామ్​ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే'

నందిగ్రామ్​ గురించి చింతించొద్దని ప్రజలకు సూచించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అక్కడి ప్రజల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. చెదిరిన భాజపా 'బంగాల్​' స్వప్నం.. కానీ...

'మిషన్​ బంగాల్'​లో భాజపా డీలా పడింది. తృణమూల్​ కాంగ్రెస్​కే మరోసారి అధికారం దక్కింది. కానీ ఈ ఎన్నికల్లో కమలదళం భారీగా పుంజుకుంది. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసే విషయమే. మరి ఇందుకు కారణాలేంటి? భాజపా తదుపరి వ్యూహాలేంటి ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. పీకే పక్కా స్కెచ్​.. మళ్లీ ఐ-ప్యాక్ సూపర్​ హిట్

సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​.. బంగాల్​లో హ్యాట్రిక్​ కొట్టింది. ఎన్నికల్లో ప్రాంతీయ, జాతీయ అంశాలు, మమత ప్రభావం ఎలాగున్నా.. టీఎంసీ​ విజయంలో తెరవెనకున్న మరో హస్తం ఐ-ప్యాక్. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. తృణమూల్​ కాంగ్రెస్ అమలుచేసిన ప్రతి వ్యూహంలో భాగస్వామి అయింది. అయితే... ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే.. తాను ఇక ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేయబోనని సంచలన ప్రకటన చేశారు ప్రశాంత్​ కిశోర్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. 'కూటమి' బేజారు- కామ్రేడ్లకు ఇక కష్టమే!

బంగాల్​ దంగల్​లో మహాకూటమి తేలిపోయింది. వామపక్షాలు, కాంగ్రెస్​, ఐఎస్​ఎఫ్​తో కూడిన కూటమి... టీఎంసీ-భాజపా మధ్య పోరులో నిలవలేకపోయింది. గతంలో సాధించిన స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది. ఫలితంగా ఆయా పార్టీల ఉనికి మరింత ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో వాటి భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. సవాళ్లే 'విజయ'న్​ సోపానాలు

2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు పినరయి విజయన్​. ఆయన పనితీరును మెచ్చిన కేరళవాసులు.. అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికి తిరిగి పట్టం గట్టారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా.. వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజా పరీక్షలో విజయం సాధించారు విజయన్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. బడ్జెట్ ధరలో బైక్​ కొనాలా? ఈ మోడళ్లు మీకోసమే..

కరోనా వల్ల సొంత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల వినియోగం పుంజుకుంది. మరి మీకు కొత్త బైక్​ కొనాలనే ప్రణాళికతో ఉంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్​ బడ్జెట్ బైక్​ల పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. మనవరాలికి మ్యూజిక్​ టీచర్​గా ఇళయరాజా

తన మనవరాలికి సంగీతం నేర్పిస్తూ ఇళయారాజా బిజీగా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి యువన్ శంకర్ రాజా సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.