ETV Bharat / city

ప్రధానవార్తలు7am

ప్రధానవార్తలు7am

7am ap topnews
ప్రధానవార్తలు7am
author img

By

Published : Aug 12, 2022, 6:58 AM IST

  • మరో బాదుడు.. కొత్తగా ఇంపాక్ట్‌ ఫీజును అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. వాణిజ్య భవనాల నిర్మాణానికి ఇంపాక్ట్‌ ఫీజుల రూపంలో ముక్కుపిండి వసూలు చేయనుంది. ప్రధాన రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే అదనపు రుసుం చెల్లించాల్సిందే. నగరాలు, పట్టణాలే కాదు.. పల్లెల్లోనూ రోడ్ల పక్కన వాణిజ్య భవన నిర్మాణాలు చేపడితే ముడుపు చెల్లించుకోవాల్సిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రక్షా బంధన్.. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలుసా

రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్షాబంధనాన్ని కడుతుంది. సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు అండగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నమైన ఈ వేడుక శ్రావణమాసంలో పౌర్ణమిరోజు జరుపుకుంటారు. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలిపే కథలు బోలెడున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓబుళాపురంలో రెండు లీజులకు ఇంకా కాలపరిమితి.. !

ఓబుళాపురం ప్రాంతంలో మూడు ఇనుప ఖనిజ లీజులకు కాలపరిమితి ఇంకా ఉంది. అందులో రెండు లీజులు గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీవే. ఈ నేపథ్యంలో ఇనుప ఖనిజ తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం.... O.M.Cకి మేలు కలిగించేందుకు ప్రయత్నించడం కాదా అనే ప్రశ్న వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉరకలెత్తిన కృష్ణమ్మ.. తెరుచుకున్న సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు

నాగార్జున సాగర్‌లో వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో వెళుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 306 టీఎంసీలకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీ సేవలు అమోఘం.. వాక్చాతుర్యం అనంతం.. వెంకయ్యను ప్రశంసిస్తూ ప్రధాని లేఖ

సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దేశానికి అందించిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. భాజపా అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా దేశం కోసం అత్యంత నిబద్ధతతో పని చేశారని ప్రశంసించారు. భూదానోద్యమ స్ఫూర్తిప్రదాత ఆచార్య వినోబా భావేతో ఆయనను పోల్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్త వ్యాధి కలకలం.. 'లంపీ'తో ఒక్క రాష్ట్రంలోనే 12 వేల మూగజీవాలు బలి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌తోపాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పశువులను లంపీ స్కిన్‌ డిసీజ్‌ వేధిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Kim Jong Un: 'కొవిడ్‌'తో కిమ్‌కు తీవ్ర అనారోగ్యం ?

ఉత్తరకొరియాలో ఇటీవల కరోనా వైరస్‌ విజృంభించిన విషయం తెలిసిందే. ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 10 రోజుల్లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు.. మార్కెట్లలో సరికొత్త జోష్​

భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. గత పది రోజుల్లో రూ.12,190 కోట్లు విలువైన షేర్లు కొనుగోలు చేయగా, దేశీయ మదుపర్లు రూ.2,667 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. విదేశీ మదుపర్ల పెట్టుబడుల రాకతో స్టాక్‌ మార్కెట్ సూచీలకు ఉత్సాహం లభించింది. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సైతం పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జింబాబ్వేతో వన్డే సిరీస్​.. టీమ్​ఇండియాకు కొత్త కెప్టెన్​

జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్​కు టీమ్​ఇండియా సారథిగా.. స్టార్ ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ను నియమించింది బీసీసీఐ. ఇటీవల జింబాబ్వే సిరీస్‌కు రాహుల్‌ లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది. అప్పుడు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్​కు అప్పగించింది. తాజాగా రాహుల్ కోలుకోవడం వల్ల బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'తప్పే కానీ తప్పలేదు.. మా సినిమాకు ఆ మాత్రం కావాల్సిందే'​

ఆసక్తి రేకెత్తించే కథాంశం.. కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఉత్కంఠ రేపే సన్నివేశాలు.. వీటన్నిటి కలబోతగా 'కార్తికేయ-2' రానుంది. హీరో నిఖిల్​ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2 ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ చిత్రానికి సీక్వెల్. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పలు విషయాలను హీరో నిఖిల్ ప్రేక్షకులతో షేర్​ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.