ETV Bharat / city

45 వేల మంది కార్మికులు.. 12 ఏళ్ల పాటు నిర్మించారు.. - నల్గొండ జిల్లా లేటెస్ట్​ వార్తలు

తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జునసాగర్​ 65 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటికి 65 సంవత్సరాలు అవుతోంది. 45 వేల మంది కార్మికులు 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ రాతి కట్టడాన్ని నిర్మించారు.

sagar
sagar
author img

By

Published : Dec 10, 2020, 10:55 AM IST

నాగార్జునసాగర్​కు శంకుస్థాపన చేసి నేటికి 65 ఏళ్లు అవుతోంది. మానవ నిర్మిత ప్రాజెక్టుగా నిలిచిన ఈ జలాశయం తెలుగు రాష్ట్రాల వరప్రదాయనిగా మారింది. 45 వేల మంది కార్మికులు 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ రాతి కట్టడాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పిల్లర్ పార్కు వద్ద శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అక్కడ పైలాన్ కూడా మనకు దర్శనం ఇస్తోంది. 1956 నుంచి జలాశయం పనులు ప్రారంభమయ్యాయి.

12 ఏళ్ల పాటు సాగిన డ్యాం నిర్మాణం పనులు 1967లో ముగిశాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జలాశయాన్ని జాతికి అంకితం చేశారు. 1970 నాటికి ప్రాజెక్టు పూర్తి కాగా.. 1974 నాటికి 26 రేడియల్ క్రస్ట్ గేట్లను అమర్చారు. డ్యాం నిర్మాణానికి రూ.73 కోట్లు ఖర్చు అయింది. ఏటా ఈ రోజున పైలాన్ పిల్లర్ వద్ద డ్యామ్ ఫౌండేషన్ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: చౌక ఫోన్ల కోసం రియల్​మీతో జియో జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.