- అక్కడే నన్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు: ఎంపీ రఘురామ
భీమవరంలో జరిగిన అల్లూరి 125 వ జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనకుండా వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. తాను హైదరాబాద్ నుంచి రైల్లో వస్తున్నానని తెలుసుకొని.., రైలు ఆంధ్రా సరిహద్దుకు చేరుకోగానే అదుపులోకి తీసుకునేందుకు ప్రణాళిక రచించారన్నారు.
- మురుగు కాలువలోకి దిగి వైకాపా ఎమ్మెల్యే నిరసన
వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి.. నెల్లూరు నగరం ఉమారెడ్డి గుంట మురుగు కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- అలిపిరి వద్ద వాహనాలు బారులు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. తనిఖీ కేంద్రం నుంచి గోమందిరం వరకు నిలిచిపోయాయి.
- ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం
ప్రభుత్వ స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక.. అడ్డుకోబోయిన అధికారులపైనే వైకాపా నాయకుడు దౌర్జన్యానికి దిగిన ఘటన సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. కదిరిలో మిగిలిన అక్రమాలు కూల్చిన తర్వాతే తన వద్దకు రావాలంటూ హెచ్చరించాడు. దీంతో అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
- ప్రముఖ వాస్తు సిద్ధాంతి హత్య.. సీఎం సీరియస్
వాస్తు శాస్త్ర నిపుణుడిగా మహారాష్ట్ర, కర్ణాటకలో పేరొందిన చంద్రశేఖర్ గురూజీ.. దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటక హుబ్బళిలోని ఓ హోటల్ రిసెప్షన్లో మంగళవారం ఇద్దరు ఆగంతుకులు ఆయన్ను కిరాతకంగా అనేక సార్లు కత్తితో పొడిచి చంపారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
- రాహుల్ గాంధీపై ఆ వీడియోలు.. టీవీ యాంకర్ అరెస్టుపై రెండు రాష్ట్రాల వార్!
న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌పై ఛత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. రాహుల్ గాంధీపై నకిలీ వీడియోల వ్యవహారంలో అతడిని అరెస్టు చేసేందుకు యూపీలోని గాజియాబాద్ వెళ్లారు. దీనిని అడ్డుకున్న యూపీ పోలీసులు.. యాంకర్‌ను తమతో తీసుకెళ్లారు. దీంతో హైడ్రామా నెలకొంది.
- రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
భారత రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని ఆరోపించారు కేరళ మంత్రి సాజి చెరియన్. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు.. మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ వాదనను అధికార సీపీఎం తోసిపుచ్చింది.
- సిడ్నీపై వరుణుడి పంజా.. ఎటు చూసినా నీళ్లే!
ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీపై వరుణుడు ప్రతాపం చూపించాడు. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాదాపు 50వేల మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారు.
- ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం- సిరీస్ సమం
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ సమమైంది.
- ఆయన విమర్శల వల్లే నటుడిగా మెరుగయ్యాను..
ప్రముఖ సినీ విశ్లేషకులు, సాహితీవేత్త గుడిపూడి శ్రీహరి మృతి పట్ల తెలుగు చిత్రసీమ సంతాపం తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ap top ten news
.
5pm top news