- మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు
వర్షాల కారణంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు మండలాల్లో జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు విష జ్వరాల బారిన పడుతున్నారు.
- జగన్‌కు అవకాశం ఇస్తే పేద ప్రజలు నష్టపోయారు: కేశినేని నాని
జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని పేద ప్రజలే నష్టపోయారని.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. అమరావతి, పోలవరం నిలిచిపోవడంతో ఎంతోమందికి పనులు దొరకట్లేదని వాపోయారు. విజయవాడలో ఫ్లైఓవర్లు తామే వేశామని సజ్జల చెప్పుకుంటుంటే, కౌంటర్ ఇవ్వటం సమయం వృథా అనిపించిందని వ్యాఖ్యానించారు.
- నిలకడగానే వారి ఆరోగ్య పరిస్థితి: వైద్యారోగ్య కమిషనర్
గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో వైద్యారోగ్య కమిషనర్ జే నివాస్ పర్యటించారు. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. వైద్య సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
- ఒక వ్యక్తి చెబితే 135 కోట్లమంది వినాలా?: యశ్వంత్ సిన్హా
హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెరాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పాల్గొన్నారు. సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెరాసకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు.
- ఉపరాష్ట్రపతి రేసులో కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఎన్డీఏ అభ్యర్థిగా!
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని ఆయన కార్యాలయం శనివారం వెల్లడించింది. అమరీందర్ సింగ్ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమరీందర్ సింగ్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లారు.
- మహారాష్ట్రలో దారుణ ఘటన.. ఉదయ్‌పుర్ తరహాలోనే!
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర అమరావతి జిల్లాలో కెమిస్ట్‌ను దుండగులు కత్తితో పొడిచి చంపిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 21న ఈ హత్య జరిగినట్లు వెల్లడించిన పోలీసులు.. ఇందుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు.
- అక్కడే విరిగిపడిన మరో కొండచరియ.. 24కు చేరిన మృతులు!
మణిపుర్ నోనె పట్టణం తుపుల్ యార్డ్ ప్రమాద స్థలానికి సమీపంలో శనివారం మరో కొండచరియ విరిగిపడింది. ఈ దృశ్యాలను ట్రెక్కర్స్ తమ మొబైల్ ఫోన్లలో నమోదు చేశారు. ఇందులో జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు.. గత బుధవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు పెరిగింది. ఇరు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు అధికారులు.
- అత్యాచార బాధితురాలిపై దాడి.. గర్భస్రావం.. చివరికి..
24 ఏళ్ల గర్భిణీపై నలుగురు దాడి చేయడం వల్ల ఆమెకు గర్భస్రావం అయింది. ఆమెపై అంతకుముందు అత్యాచారానికి పాల్పడిన వారే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
- అప్పుడు యువీ.. ఇప్పుడు బుమ్రా వరల్డ్ రికార్డ్..
టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో స్టువర్ట్‌బ్రాడ్ ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చాడు. ఇందులో 29 పరుగులు చేశాడు బుమ్రా. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు.
- ఒకే సినిమాలో ప్రభాస్, యశ్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనే!
ప్రభాస్, యశ్.. ఇప్పుడు ట్రెండింగ్‌లో పాన్ ఇండియా స్టార్స్. ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలకు మామూలు డిమాండ్ లేదు. ప్రభాస్, యశ్ మూవీస్ వేరు వేరుగా వస్తేనే.. అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేస్తుంటారు. అయితే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే.. దానికి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తే?
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
5pm Top news