- ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు సైనికులు మృతి
Indian Army soldiers: లద్దాఖ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తుర్తుక్ సెక్టార్ వద్ద జరిగిన దుర్ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపునకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
- తెలంగాణలో మరో పరువు హత్య.. ఈసారి కన్న కూతురినే హతమార్చిన తల్లిదండ్రులు
Honor Killing: ఈ మధ్య కాలంలో తెలంగాణలో పరువుహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకదాన్ని మర్చిపోయేలోపే ఇంకోటి జరుగుతూ.. భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే ఇటీవల ఒకదాని వెనక ఇంకోటి రెండు పరువు హత్యలు సంచలనం సృష్టించాయి. అవి మరవకముందే.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండలో మరో ఘాతుకం వెలుగుచూసింది.
- గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు, కూతురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులతో ఓ కుమార్తె మృతి చెందారు. ప్రమాదం నుంచి కుమారుడు లోహిత్ సాయి బయటపడ్డాడు. మృతులు విజయవాడ కస్తూరిబాయిపేట వాసులుగా గుర్తించారు.
- తెదేపా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ : బాలకృష్ణ
Balakrishna at Kodikonda: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్తలను.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. వారికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
- 'మహానాడు'లో పసందైన వంటకాలు.. చూస్తే నోరూరాల్సిందే..!
MAHANDU FOOD: మహానాడులోని సిద్ధమైన వంటకాలు చూస్తే ఎవరికైనా.. ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి.. రోజు తిన్నామంటే మోజే తీరనిది..! అనే పాట గుర్తొస్తది. ఎందుకంటే అక్కడ తయారుచేసినవి అలా ఉన్నాయి మరి! రెండు రోజులపాటు కొనసాగే మహానాడు కార్యక్రమానికి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలకు పసందైన విందు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టేలా ఆంధ్ర వంటకాలను అతిథుల కోసం వండి వారుస్తున్నారు.
- అక్రమాస్తుల కేసులో మాజీ సీఎంకు షాక్- నాలుగేళ్లు జైలు, రూ.50లక్షలు ఫైన్
OP Chautala Case: అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓపీ చౌతాలాకు శిక్ష ఖరారు చేసింది దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. నాలుగేళ్లు జైలుశిక్ష, రూ.50లక్షలు జరిమానా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.
- పిల్లాడిని అతి దారుణంగా కరిచిన వీధి కుక్కలు.. శరీరంపై 40 గాయాలు!
Dogs Bite Boy 40 places In Jaipur: రాజస్థాన్ జైపుర్‌లో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 9ఏళ్ల బాలుడిని శునకాలు అతి దారుణంగా కరిచాయి. ముహానా పోలీసు స్టేషన్ పరిధిలోని బాలుడి ఇంటి ముందు ఈ ఘటన జరగగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బాలుడు తప్పించుకునేందుకు కారు వెనక్కి వెళ్లినా.. వీధి శునకాలు వదల్లేదు.
- వారాంతంలో 'బుల్' జోరు.. సెన్సెక్స్ 630, నిఫ్టీ 180 ప్లస్
Stock Markets Close: స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో సెషన్లోనూ లాభాల జోరు కొనసాగింది. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలతో సెన్సెక్స్ 630, నిఫ్టీ 180 పాయింట్లకుపైగా లాభపడ్డాయి.
- లీటర్ పెట్రోల్ ధర రూ.30 పెంపు- మోదీపై మాజీ ప్రధాని ప్రశంసలు
Pakistan petrol price: ఆర్థికంగా సతమవుతున్న పాకిస్థాన్‌లో ఇంధన ధరలను పెంచి ప్రజలపై మరింత భారం వేసింది అక్కడి ప్రభుత్వం. అన్ని రకాల పెట్రోల్ ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్యపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది అంటూ ప్రశంసించారు.