ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

.

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Mar 23, 2022, 4:58 PM IST

  • కొవిడ్​ రూల్స్​ అన్నింటికీ కేంద్రం గుడ్​బై !
    కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి గత రెండేళ్లుగా ఆంక్షల చట్రంలో నలిగిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రహోంశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రసాదంపాడులో తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!
    విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాటుసారా మరణాలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎమ్మెల్యే అమర్నాథ్​పై.. పరువు నష్టం దావా వేస్తా: ఏబీవీ
    పెగాసస్ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తనపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. అడ్డదారిన నిధులు మళ్లిస్తోంది'
    గ్రామ పంచాయతీ నిధులను దారి మళ్లించటంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దొడ్డిదారిన నిధులు మళ్లించడం చూస్తే.. రాష్ట్ర ఖజానా దుస్థితి తేటతెల్లం అవుతోందని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ యువకుడి మృతదేహానికి.. రీ-పోస్టుమార్టం చేయండి'
    పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లికి చెందిన దళిత యువకుడి మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసును పక్కదారి పట్టిస్తున్నారని మృతుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పండిన ధాన్యం అంతా కొనలేం.. దానికి కొన్ని లెక్కలుంటాయి: కేంద్రం
    రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదని కేంద్రం స్పష్టం చేసింది. ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయన్న కేంద్రం.. పరిస్థితులను బట్టి సేకరణ జరుగుతుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డిశ్చార్జ్​ అయిన గంటల్లోనే ఎమర్జెన్సీకి.. లాలూకు ఏమైంది?
    ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ ఆరోగ్యం క్షీణించటం వల్ల మంగళవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్​కు తీసుకెళ్లి చికిత్స అందించారు. బుధవారం తెల్లవారుజామున డిశ్చార్జి చేయగా.. మధ్యాహ్నానికి మళ్లీ ఎమర్జెన్సీకి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆరంభ లాభాలు ఆవిరి.. సెన్సెక్స్​ 300, నిఫ్టీ 70 డౌన్
    దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ నష్టాలు నమోదుచేశాయి. తీవ్ర ఒడుదొడుకుల సెషన్​లో సెన్సెక్స్​ 300, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IPL 2022: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!
    ఐపీఎల్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను మైదానాలకు స్వాగతం పలుకుతున్నామని బీసీసీఐ తెలిపింది. ఈ నెల 26న ప్రారంభమయ్యే ఐపీఎల్​ 15వ సీజన్​కు 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్ట్రేలియాలో తారక్​ క్రేజ్​..​ 'జై ఎన్టీఆర్​​' ఆకృతిలో కార్ల ర్యాలీ
    మరి రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందానికి వినూత్న రూపంలో విషెస్​ తెలిపారు ఆస్ట్రేలియాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్​. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్​ఆర్​ఆర్', 'జై ఎన్టీఆర్'​​ ఆకృతిలో వాటిని అమర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.