ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - తెలుగు వార్తలు

.

5pm top news
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Aug 2, 2021, 5:00 PM IST

  • పునరాలోచన లేదు: కేంద్రం
    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విషయంలో పునరాలోచన లేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లోకసభలో ప్రకటించింది. ప్రసుత్తం కర్మాగారంలో పని చేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరింత మెరుగుపరచాలి: సీఎం జగన్‌
    కొవిడ్ నియంత్రణ, వైద్యశాఖలో 'నాడు-నేడు'పై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు మరింత మెరుగుపరచాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఆయన..పెళ్లిళ్లు, శుభకార్యాలకు తక్కువమంది హాజరయ్యేలా చూడాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ప్రైవేటీకరణ కానివ్వబోం'
    ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో పోరాటాలతో విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ వచ్చిందన్నారు. సీఎం జగన్‌ దిశానిర్దేశంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మహోత్తరమైన ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు అంగీకరించబోమని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మద్యం దుకాణం లేని గ్రామమే లేదు'
    రాష్ట్రంలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్ చెప్పిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని.. ఆయన ప్రశ్నించారు. మద్యం దుకాణాలు పెంచడమే.. మద్యపాన నిషేధమా అని నిలదీశారు. మద్యం మత్తులో మునిగి తేలుతున్న వైకాపా ప్రభుత్వానికి.. మహిళలు మత్తు వదిలించడం ఖాయమని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అడ్డుకున్న భాజపా శ్రేణులు
    మహారాష్ట్రలోని సంగ్లీలో భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్​ను అడ్డుకునేందుకు భాజపా వర్గాలు యత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విపక్ష నేతలతో రాహుల్​ భేటీ
    పెగసస్ వ్యవహారంపై మోదీ సర్కారును ఇరుకున పెట్టే విధంగా వ్యూహాన్ని రచించేందుకు విపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. టీఎంసీ సహా అన్ని విపక్షాల ఎంపీలు, ఫ్లోర్ లీడర్లను అల్పాహార విందుకు ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శాంతి కోసం కేంద్రం ప్రయత్నం
    అసోం-మిజోరం సరిహద్దు వివాదానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు కేంద్రం కృషి చేస్తోందని మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు తెలిపారు. సోమవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మరోవైపు.. అసోం భాజపా ఎంపీలు కూడా మోదీతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 302 మంది మృతి
    చైనాలో వరదల ప్రభావానికి మరణించిన సంఖ్య 302కు చేరిందని అధికారులు వెల్లడించారు. 50 మంది ఆచూకీ కోల్పోయారని తెలిపారు. ఒక్క ఝెంగ్​జౌ నగరంలోనే 292 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీ పోలీసుల ఛార్జిషీట్
    మల్లయోధుడు సాగర్​ రానా హత్య కేసు ప్రధాన నిందితుడు రెజ్లర్​ సుశీల్ కుమార్​ (sushil kumar wrestler)తో పాటు మరో 19మందిపై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేశారు. ఇందులో సుశీల్​ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జాతీయ గీతాన్నీ వదల్లేదు!
    ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్​ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాను రూపొందించిన ఓ పాట కోసం ఏకంగా ఓ దేశ జాతీయ గీతాన్ని ఉపయోగించారని ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.