- దేవభూమిలో ప్రళయం- 150 మంది బలి!
ఉత్తరాఖండ్‌లో జలప్రళయం సంభవించింది. హిమనీనదం కట్టలు తెంచుకోవడం వల్ల ధౌలిగంగా నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఆనకట్ట ధ్వంసమై తపోవన్ వద్ద విద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తోన్న 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు మృతి చెంది ఉంటారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మదనపల్లెలో యోగశాల, భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
మదనపల్లె సత్సంగ్ ఫౌండేషన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించారు. యోగశాల, భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యార్థిని ఆత్మహత్యపై.. విచారణకు కమిటీ: మంత్రి ఆదిమూలపు
ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతు ఆందోళన
అమరావతి కోసం రైతులు 418రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని.. ఓ రైతు వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆందోళనకు దిగారు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పల్లె పోరు: ఆ పంచాయతీకి సర్పంచి ఉండరు... ఎందుకంటే..?
పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు... చిత్ర విచిత్రాలు.. అనూహ్య పరిణామాలు సాధారణమే..! కానీ ఆ పంచాయతీలో మాత్రం కాస్త విభిన్న పరిస్థితే. అంతటా ఎన్నికలు జరిగినట్లే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ సర్పంచి అభ్యర్థి స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అయోధ్య రామాలయం పనులపై యోగి సమీక్ష
అయోధ్యలో రామ్‌లల్లా అలయాన్ని సందర్శించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్. పూజల అనంతరం ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పీఎస్‌యూల ప్రైవేటీకరణపై నిర్మల కీలక వ్యాఖ్యలు
సంక్షోభ సమయంలో విలువైన ప్రభుత్వ ఆస్తులను కేంద్రం విక్రయిస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డాక్టర్ వద్దకు బైడెన్- కారణమిదే...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆర్థోపెడిక్ నిపుణుడ్ని సంప్రదించారు. గతంలో కాలు బెణికిన గాయానికి చికిత్సలో భాగంగా డాక్టర్లు ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుంబ్లే గొప్ప మ్యాచ్ విన్నర్: గంభీర్
టెస్టుల్లో అరుదైన పది వికెట్ల రికార్డు సాధించిన అనిల్ కుంబ్లే.. గొప్ప మ్యాచ్ విన్నర్ అని గంభీర్ ప్రశంసించాడు. బీసీసీఐ ట్విట్టర్లో పంచుకున్న వీడియోపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు టీమ్ ఇండియా మాజీ ఓపెనర్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కంగనా రనౌత్‌పై రోజుకో కేసు.. ఇంటికి సమన్లు!
నెల రోజుల వ్యవధిలో తన బ్రాండలన్నీ కోల్పోయినట్లు నటి కంగన వెల్లడించింది. వాటి విలువ దాదాపు రూ.15 కోట్లు ఉంటాయని తెలిపింది. అలానే రోజూ తనపై కొత్త కేసులు నమోదు అవుతున్నాయని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.