- రైతులను ఆదుకునేందుకు సీఎం కీలక ఆదేశాలు
పొగాకు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ మార్కెటింగ్ శాఖ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. పొగాకు కనీస ధరలను త్వరలో ప్రకటించాలని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని విచారించాలని కోర్టులో పీటీ వారంట్లు వేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 'అన్ని పిటిషన్ల పై ఒకేసారి విచారణ చేపడతాం'
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పునర్ నియాకాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌పై సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 'లోకేశ్ లక్ష్యంగా వైకాపా మంత్రుల దాడి'
శాసనమండలిలో వైకాపా మంత్రులు లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడికి విశ్వ ప్రయత్నం చేశారని తెదేపా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. లోకేశ్ తన ఫోన్లో మెసేజ్‌లు చూస్తుంటే.. ఫోటోలు తీస్తున్నాడని ఆయనపై దాడికి వచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- చైనా వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ భారత్
గాల్వన్ లోయ తమదేనంటూ చైనా చేస్తోన్న వ్యాఖ్యలపై భారత్ మరోసారి మండిపడింది. ఈ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చైనా కంపెనీతో రైల్వే కాంట్రాక్ట్ రద్దు!
ఓ చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కాన్పూర్ - మొగల్ సరాయి మధ్య నిర్మిస్తున్న రైల్వే లైనులో.. సిగ్నలింగ్, టెలికమ్యునికేషన్ పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం చేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఏజీఆర్ బకాయిలు చెల్లించండి.. కష్టాల్లో ఉన్నాం ప్లీజ్!
గెయిల్ వంటి టెలికామేతర సంస్థల ఏజీఆర్ బకాయిల్లో.. టెలికాం విభాగం 96 శాతం వదులుకోనున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే టెలికాం కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ వంటి సంస్థలు తక్షణం ఎంతో కొంత సొమ్ము డిపాజిట్ చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఫ్లషింగ్ టాయిలెట్స్‌తోనూ వైరస్ ముప్పు!
కరోనా మహమ్మారి జీర్ణవ్యవస్థలో కూడా జీవించగలదని చైనాలోని యాంగ్జౌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. మలంలోనూ వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడించారు. అందుకే టాయిలెట్‌ను వాడిన తర్వాత వెంటనే లిడ్‌తో దానిని మూసివేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
'ధోనీ దృష్టిలో పడేందుకు బాగా కష్టపడ్డా'
తన కెరీర్‌పై మాజీ సారథి ధోనీ ప్రభావం ఉందని చెప్పిన స్పిన్నర్ అశ్విన్.. ఐపీఎల్ తొలి సీజన్లో అతడి కంట్లో పడేందుకు చాలా కష్టపడినట్లు తెలిపాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- సుశాంత్ మృతిపై ఏక్తా: ఎప్పటికైనా గెలిచేది నిజమే
సుశాంత్ మృతి విషయంలో తనపై కేసు పెట్టడంపై నిర్మాత ఏక్తా కపూర్ స్పందించింది. ఎప్పటికైనా గెలిచేది నిజమేనని ఇన్‌స్టాలో పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి