- దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటాం - మంత్రి గుడివాడ అమర్నాథ్
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో .. పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
- సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై... సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
- లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు దాడి.. మామ మృతి.. రహస్య వీడియోలు వైరల్
మామ పెట్టే లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు తిరగబడింది.. తమ్ముడి సాయం తీసుకుని కర్రతో దాడి చేసింది.. తీవ్రంగా గాయపడిన మామ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చెన్నూరులో చోటుచేసుకుంది.
- ప్రాణం తీసిన 'ఉప్పు'.. గోడ కూలి 12 మంది దుర్మరణం
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలోని ఓ కర్మాగారంలో గోడ కూలి 12 మంది కార్మికులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
- రాజీవ్ హత్య కేసు దోషి విడుదల- సుప్రీం 'అసాధారణ' తీర్పు
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన పెరారివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించి పెరారివాలన్‌ను విడుదల చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
- స్కూల్ ముందే అమ్మాయిల భీకర ఫైట్.. జుట్లు పట్టుకుని, పిడిగుద్దులతో..
అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. అక్కడ ఉన్న ఓ స్కూల్ ముందే 20 మందికిపైగా బాలికలు గొడవకు దిగారు. జట్లు పట్టుకుని.. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. వారి గొడవకు కారణమేంటో తెలియదు కానీ.. ఆ అమ్మాయిల మధ్య ఘర్షణను ఆపడం అక్కడున్న వారి వల్ల కాలేదు.
- నాటోలో చేరుతున్న ఫిన్లాండ్, స్వీడన్.. టర్కీ అభ్యంతరం చెప్పినా..
నాటోలో చేరేందుకు అధికారిక ప్రక్రియ ప్రారంభించాయి స్వీడన్, ఫిన్లాండ్. దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో అందజేయనున్నాయి. అయితే వీటి చేరికను వ్యతిరేకిస్తున్న టర్కీ.. అడ్డుపడుతుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
- వడ్డీరేట్లు పెరిగాయని బాధపడుతున్నారా? ఇలా చేస్తే కాస్త ఉపశమనం!
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇటీవల కీలక వడ్డీరేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో రుణ రేట్లు పెరగడం లోన్ తీసుకున్న వారికి ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే ఆ భారాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు.
- థాయ్‌లాండ్ ఓపెన్‌లో శ్రీకాంత్ శుభారంభం.. రెండో రౌండ్‌కు అర్హత
థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో శుభారంభాన్నిచ్చాడు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్. తొలి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్‌పై విజయం సాధించాడు. అయితే మిగతా విభగాల్లో భారత ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచి.. మొదటి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.
- ‘ఎఫ్3’ టికెట్ రేట్ల పెంపుపై దిల్‌రాజు ఏమన్నారంటే?
విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎఫ్3’ సినిమా మే 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు నిర్మాత దిల్‌రాజు.