- CABINET MEET: ముగిసిన మంత్రిమండలి భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్‌లో ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పులిచింతల ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు.. స్టాప్ లాక్ ఏర్పాటుకు సన్నాహాలు..
పులిచింతల ప్రాజెక్టు విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో.. ప్రాజెక్టులో ప్రస్తుతం 13.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- PV. sindhu: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు..
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు.. ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. సీఎం జగన్, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 30 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- auto driver attack on women: మహిళపై ఆటోడ్రైవర్ దాష్టీకం.. అప్పు డబ్బులు అడిగితే కాలితో తన్నాడు
ఇచ్చిన డబ్బు అడగడమే ఆమె చేసిన నేరమైంది. బాకీ అడిగినందుకు ఓ డ్రైవర్ విచక్షణ కోల్పోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో ఎగిరి తన్నాడు. సీఎం నివాస ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. పోలీసులు నిందుతుడ్ని అదుపు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌కు 'ఈటా' వైరస్- దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిలో...
కొవిడ్ వైరస్ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ.. విస్తరిస్తోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్' భారత్‌కు పాకింది. మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగని విపక్షాల ఆందోళన- కీలక బిల్లులకు ఆమోదం
పెగసస్ స్పైవేర్, రైతుల ఆందోళనలు, సాగు చట్టాలపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. నిరసనల మధ్యే.. రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్‌సభ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సినిమా సీన్స్ కావివి.. అమెరికాలోని షాకింగ్ పిక్చర్స్!
కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. దావానలం బీభత్సానికి.. గ్రీన్విల్లే ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సైన్యం దాడిలో 94 మంది తాలిబన్లు హతం
అఫ్గానిస్థాన్ హెల్మాండ్ రాష్ట్రంలో ఆ దేశ భద్రతా దళాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 94 మంది తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 16 మంది గాయపడినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు.. భారత అధ్యక్షతన యూఎన్ఎస్సీలో నేడు జరిగే సమావేశంలో అఫ్గాన్‌లో హింసపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళా హాకీ జట్టులో స్ఫూర్తినింపిన ప్రధాని మోదీ
భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో ఓడిపోయినప్పటికీ.. మహిళలు దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పేరుపేరునా అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోర్నోగ్రఫీ కేసు: పోలీసుల ముందుకు నటి షెర్లిన్ చోప్రా
అశ్లీల చిత్రాల కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా.. శుక్రవారం ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరైంది. ఈ కేసులో ఇప్పటికే వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.