ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 3PM

ప్రధాన వార్తలు

3pm Top news
ప్రధాన వార్తలు@ 3PM
author img

By

Published : Jun 28, 2021, 3:01 PM IST

Updated : Jun 28, 2021, 3:39 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • రాష్ట్రంలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
    రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ మరోలేఖ
    వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. లోక్​సభ స్పీకర్​కు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు కోసం పార్టీ నేతలు అనేక పక్కదారులు పడుతున్నారని లేఖలో వివరించారు. కుట్రలు, ప్రణాళికల ద్వారా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్ అందక చనిపోయారా? అధికారుల నిర్లక్ష్యమా?: హైకోర్టు
    తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న ధర్నాసనం ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో తేల్చాలని.. ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఎవరు అధికారంలో ఉన్నా.. రాయలసీమకు అన్యాయమే'
    రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కుయుక్తులు చేయడం దుర్మార్గమైన చర్య అని కడప జిల్లా అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ఎవరు అధికారంలో ఉన్నా.. రాయలసీమకు తీవ్ర అన్యాయమే చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం'
    కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లాయర్లకు సుప్రీం నివాళులు
    కరోనాతో మృతి చెందిన న్యాయవాదులకు నివాళులర్పించింది సుప్రీం కోర్టు. వేసవి సెలవుల తర్వాత తిరిగి ప్రారంభమైన క్రమంలో.. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బీటా వేరియంట్​పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?
    కొవిడ్​ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు.. వైరస్​ రూపాంతరం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన బీటా వేరియంట్​పై ప్రస్తుత టీకాల ప్రభావంపై పరిశోధన చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. వాటి ప్రభావం అంతంతమాత్రమేనని తేల్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అన్ని కార్లలోనూ ఎయిర్​బ్యాగ్స్
    దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని కార్లలోనూ ఎయిర్​బ్యాగ్స్​ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2021 డిసెంబర్ 31వరకు వాయిదా వేసింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియా.. మరో ఛాలెంజ్​కు సిద్ధం
    మరో ఛాలెంజ్​కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. గత 14 రోజులుగా క్వారంటైన్​లో మన బృందం.. శ్రీలంకకు సోమవారం పయనమైంది. తొలి మ్యాచ్ జులై 13న జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టార్ హీరో డ్రీమ్ హౌస్​ కోసం రూ.150 కోట్లు!
    తన కొత్త ఇంటి కోసం కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్(Dhanush)​ భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హాలీవుడ్​లో ఓ సినిమా సహా ఇక్కడ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 28, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.