ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - ap top ten news

.

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3PM
author img

By

Published : Aug 17, 2020, 2:59 PM IST

  • తుంగభద్ర పరవళ్లు
    ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటికే ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తిన అధికారులు... భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని మరో ఏడు గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మహోగ్రరూపం
    ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని లంకభూములు, తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాస్తున్నారు'
    స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణకు అడ్డు వస్తే సినీ హీరో రామ్​కు సైతం నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సృష్టికర్త ఈయనే...
    భార్య లేని లోటు తెలియకూడదని ఆమె మైనపు విగ్రహంతో గృహ ప్రవేశ వేడుక నిర్వహించిన ఘటన గుర్తుంది కదా? అచ్చు మనిషిలాగానే కనిపించిన ఆ ప్రతిమను రూపొందించింది ఎవరో తెలుసా? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉన్నత స్థాయి చర్చలు
    భారత్​ సహాయంతో నేపాల్​లో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ఇరు దేశాలు సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆ దేశ ప్రధానికి అస్వస్థత
    జపాన్​ ప్రధానమంత్రి షింజో అబే ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే టోక్యోలోని కీయో విశ్వవిద్యాలయం ఆస్పత్రికి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... 65 ఏళ్ల అబే ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారీ పెట్టుబడులు!
    దేశీయ సోషల్​ మీడియా సంస్థ షేర్​ చాట్​- సెర్చ్ ఇంజన్​ దిగ్గజం గూగుల్ మధ్య భారీ పెట్టుబడులకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షేర్​ చాట్​ ఇప్పటికే టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ నుంచి 100 మిలియన్​ డాలర్ల పెట్టుబడి కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'నేను చూసిన బెస్ట్​ కెప్టెన్​ ధోనీ'
    స్టార్ క్రికెటర్ ధోనీ.. తాను చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని టీమ్​ఇండియా మాజీ కోచ్​ గ్యారీ కిర్​స్టన్​ అన్నాడు. మాహీ లాంటి సారథితో కలిసి పని చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.