ETV Bharat / city

ప్రధానవార్తలు@3PM - trending news

.

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jul 1, 2020, 3:00 PM IST

  • విజృంభిస్తున్న కరోనా

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15, 252కు చేరింది. తాజాగా నమోదైన వాటిలో రాష్ట్ర వాసులు 611 మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 39 మందికి వైరస్ సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఏడుగురు మహమ్మారి బారిన పడ్డారు. కొత్తగా ఆరుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నమ్మకం లేదు

ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందన్న నమ్మకం తనకు లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలగింపు

సింహాచల వరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నుంచి గెడ్డం ఉమను తొలగిస్తున్నట్లు... దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డ్ ప్రకారం వయో పరిమితి తక్కువ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 108 డ్రైవర్లకు శుభవార్త

ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 సిబ్బందికి భారీగా జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 108 డ్రైవర్లకు 10 వేల రూపాయలు మాత్రమే జీతం వస్తోందన్న సీఎం... అనుభవాన్ని బట్టి వారికి 18 - 28 వేల రూపాయల వరకు ఇస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా ముప్పును తక్కువ చేసి చూపుతున్నారు

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సమస్య ఏమాత్రం పెద్దది కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాన్ని అంగీకరించి సమస్యపై పోరాడాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'భారతీయ ఫార్మాకు చైనానే దిక్కు!'

చైనాపై ఆధారపడి ఉన్న కీలకమైన రంగాల్లో ఫార్మా ఒకటి. ఆ దేశం నుంచి ముడిసరకులు రానిదే ఇక్కడ పని జరగదు. ఈ రంగాలకు చైనా కాకుండా మరో ప్రత్యామ్నాయం లేదు. మరి ఈ విషయంలో స్వావంలంబన సాధించాలంటే ఎనిమిది నుంచి పదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాక్​ క్రికెటర్లకు కరోనా నెగటివ్​

ఇంగ్లీష్ గడ్డపై పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్​ క్రికెట్​ బృందానికి, కరోనా నెగటివ్​గా తేలిందని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు తెలిపింది. ఇటీవలే తమ దేశానికి చేరుకున్న పాక్ జట్టు సభ్యులకు (20 మంది ఆటగాళ్లు + 11 మంది సహాయక సిబ్బంది) ఈ పరీక్షలు చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2027​కు భారత్ ఆతిథ్యం​!

2027లో ఫుట్​బాల్​ ఆసియాకప్​ నిర్వహించేందుకు భారత్​తో పాటు మరో నాలుగు దేశాలు పోటీపడుతున్నట్లు ఆసియా ఫుట్​బాల్​ సమాఖ్య (ఏఎఫ్​సీ) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్​తో పాటు ఇరాన్​, ఖతార్​, సౌదీ అరేబియా, ఉజ్భెకిస్థాన్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రియాంక చోప్రా ఒప్పందం

అమెజాన్​ ప్రైమ్​ వీడియోతో భాగస్వామిగా మారిన నటి ప్రియాంక చోప్రా.. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడం సహా నిర్మాతగానూ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అర్ధరాత్రి ఆడిషన్​ ఇచ్చిన నటుడు

దిగ్గజ సంగీత దర్శకుల ద్వయం ఆనంద్​-మిలింద్​​.. బాలీవుడ్​ సీనియర్​ నటుడు గోవిందా డ్యాన్స్​ ప్రతిభ అద్భుతమని ప్రశంసించారు. సినిమాల్లోకి రాకముందు అతడిని ఓ అర్ధరాత్రి ఆడిషన్​ చేసినట్లు వెల్లడించారు. ఆ రోజు గోవిందా వేసిన నృత్యానికి ఫిదా అయినట్లు గుర్తుచేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.