ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

.

author img

By

Published : Jul 7, 2020, 2:57 PM IST

ప్రధాన వార్తలు@3pm
ప్రధాన వార్తలు@3pm
  • రాష్ట్రంలో కొత్తగా 1,178

రాష్ట్రంలో నేడు కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 252 కు చేరింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సౌకర్యాలపై ఆరా

విజయవాడ కొవిడ్​ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, సదుపాయాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కరోనా బాధితులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • రేపు వైఎస్ఆర్ జయంతి

రేపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని వైభవంగా జరపాలని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు లోక్​సభ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీల‌ు, ఎమ్మెల్యేల‌ు, ఎమ్మెల్సీల‌కు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మన్వయ కర్తలకు, ముఖ్య నాయకులకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి సందేశాలు పంపింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • హైకోర్టు స్టే వల్లే..

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం వల్లే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉండడం వల్లే ప్రక్రియ నిలిపివేశామని అన్నారు. అవరోధాలను అధిగమించి ఆగస్టు 15 నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

రాజ్​నాథ్​ సమీక్ష

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను రాజ్​నాథ్​కు వివరించారు అధికారులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ పని ఎందుకు చేయలేదు?

సరిహద్దులో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి చైనాపై భారత్​ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ఈ మేరకు ప్రభుత్వం బాధ్యతలను గుర్తుచేస్తూ ట్వీట్​ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • అవకాశాలూ పెరిగాయ్

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు తమకు అనేక సవాళ్లతో పాటు.. కొత్త కొత్త అవకాశాలను కూడా కల్పించినట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. వీటన్నింటినీ తట్టుకుని భవిష్యత్​లో మరింత బలంగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 50కు చేరిన మృతులు

జపాన్​ వరదల్లో మృతుల సంఖ్య 50కు చేరింది. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • శుభాకాంక్షల వెల్లువ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. కెరీర్​లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సూజిత్ దూరం!

కొత్త సినిమాను త్వరగా పూర్తిచేసేందుకుగాను, కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు దర్శకుడు సూజిత్ సర్కార్. ఈ మేరకు అభిమానులను ఇన్​స్టాలో, ఇదే విషయమై ప్రశ్నించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.