రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు.. 2 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 275 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 76 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,071కి చేరింది. మొత్తం 15,188 శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 90గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: