తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఆదివారం 237 కరోనా కేసులు నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,974కు చేరింది. ఆదివారం కొవిడ్ బారినపడి ముగ్గురు బాధితులు మరణించగా.. ఇప్పటివరకు 185 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకొని 2,377 మంది డిశ్చార్జ్ కాగా.. 2,412 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణలో నిర్ధరణ అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎసీలోనే అత్యధికంగా 195 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన ఒక్కరోజు కేసులతో పోల్చితే సోమవారం నమోదైనవే అత్యధికం. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,054 కరోరా కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యధికంగా 825 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 4,525 మంది రాష్ట్రానికి చెందివారు కాగా.. 449 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి