ETV Bharat / city

NAGARJUNA SAGAR: జలాశయానికి తగ్గుతున్న వరద.. దిగువకు 3 లక్షల 18 క్యూసెక్కులు - తెలంగాణ 2021 వార్తలు

నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద రావడంతో.. 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3 లక్షల 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 587.30 (గరిష్టం 590) అడుగుల వద్ద ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి గేట్లు విద్యుదుత్పత్తిని కలుపుకొని ప్రకాశం బ్యారేజీకి 3.54 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

crusted-gates
crusted-gates
author img

By

Published : Aug 3, 2021, 8:44 AM IST

నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద రావడంతో... వచ్చిన నీటిని వచ్చినట్లే దాదాపుగా దిగువకు వదులుతున్నారు. రోజుకు 28 టీఎంసీలు సముద్రంవైపుకి వెళ్తున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం ఉద్ధృతి దృష్ట్యా ఆదివారం సాయంత్రం 14 గేట్ల ద్వారా లక్షా 6 వేల 462 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు... అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3 లక్షల 18 వేల క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సాగర్​కు 3 లక్షల 72 వేల 737 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... గేట్ల ద్వారా 3 లక్షల 18 వేల 934 క్యూసెక్కులు, ఎడమకాల్వ, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎస్​ఎల్బీసీ, వరద కాల్వ ఇతరత్రా కలుపుకొని మొత్తం 3 లక్షల 55 వేల 349 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ నీటిమట్టం 587.30 (గరిష్ఠం 590) అడుగుల వద్ద ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి గేట్లు విద్యుదుత్పత్తిని కలుపుకొని ప్రకాశం బ్యారేజీకి 3.54 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సుంకేశుల నుంచి 36, 576 క్యూసెక్కులు,, జూరాల నుంచి 2,44,375 క్యూసెక్కులు శ్రీశైలం వైపునకు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం 29,893 క్యూసెక్కులు తెలంగాణ జల విద్యుదుత్పత్తిలో 33,459 క్యూసెక్కులు, గేట్లు ఇతరత్రా కలిపి 4,36,170 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

పశ్చిమ గాలులతో పొడి వాతావరణం..

పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగామ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. బుతుపవనాల కదలికలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. వర్షాలూ తగ్గిపోయాయి. మంగళ, బుధ వారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు 36 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని ధరూర్​లో 1.9 సెంటీ మీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగులో 1.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

ఇదీ చూడండి: నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ సమావేశం.. తెలంగాణ హాజరు అనుమానమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.