ETV Bharat / city

సచివాలయంలో ప్రధాన గేట్ల తొలగింపు.. కారణం ఇదీ..? - two gates removed in ap secratariate news

వెలగపూడి సచివాలయంలో రెండు ప్రధాన గేట్లను తొలగించి.. వాటి స్థానంలో ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. వాస్తు ప్రకారం గేట్ల నిర్మాణం సరిగా లేదని వీటిని తొలగించినట్లు తెలుస్తుండగా.. భద్రతా కారణాల రీత్యా గోడ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సచివాలయంలో ప్రధాన గేట్ల తొలగింపు.. ప్రహరీ నిర్మాణం

author img

By

Published : Jul 27, 2020, 5:04 PM IST

Updated : Jul 27, 2020, 5:11 PM IST

వెలగపూడి సచివాలయంలోని ప్రహరీకి ఉన్న రెండు ప్రధాన గేట్లను తొలగించి వాటిస్థానే గోడ నిర్మాణాన్ని సీఆర్డీఏ అధికారులు చేపట్టారు. సచివాలయంలో నాలుగు - ఐదో బ్లాక్​లకు సమీపంలోని ఉత్తరం వైపు ఉన్న గేటుతో సహా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఒకటో బ్లాక్ వద్ద ఉన్న మరో గేటును తొలగించి.. ప్రహరీ నిర్మాణం చేపట్టారు.

వాస్తు ప్రకారం గేట్ల నిర్మాణం సరిగా లేదంటూ సూచనలు రావటంతో.. హుటాహుటిన ఈ గేట్లను తొలగించి గోడ నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల రీత్యా ఉత్తర, దక్షిణం వైపు ఉన్న గేట్లను మూసివేస్తున్నట్టు సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చూడండి..

అమర్​ రాజా భూముల వ్యవహారంలో ప్రభుత్వ జీవో రద్దు

Last Updated : Jul 27, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.