- వైకాపా ఎంపీటీసీకి మంత్రి కుమారుడి బెదిరింపులు..! ఆడియో వైరల్
Audio Viral: మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి.. వైకాపా ఎంపీటీసీ సత్తిబాబుపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నా ఇల్లు అంటిస్తారా.. మా అమ్మా, నాన్నను చంపేస్తారా మిమ్మల్నీ చంపుతానంటూ.. బెదిరించిన ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
- Lokesh: అధికార పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది: నారా లోకేశ్
Lokesh: పోలవరం ఏఈ సూర్యకిరణ్‌పై వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయి.. ప్రభుత్వ ఉద్యోగులపై పడ్డారని మండిపడ్డారు. మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజనీరుపై దాడి జరిగినా.. ఎవరూ ఆపే ప్రయత్నం చెయ్యకపోవడం విచారకరమని అన్నారు.
- పింఛన్లో చెత్త పన్ను కోత... పురపాలిక సిబ్బంది, వాలంటీర్ల నిర్వాకం
Pension cut: కర్నూలు జిల్లాలో కొందరు లబ్ధిదారులకు పింఛన్లో కోత విధించి.. మిగతా సొమ్మునే వాలంటీర్లు అందజేశారు. కుటుంబానికి ఆసరాగా ఉండే పింఛన్లో కోత విధించటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టనందునే పింఛన్లో ఆ డబ్బును కోత విధించి.. మిగతాది అందజేసినట్లు వాలంటీర్లు తెలిపారు. చెత్త పన్ను కట్టకపోతే అమ్మఒడి, ఇతర పథకాలు రద్దు చేస్తారంటూ వాలంటీర్లు బెదిరిస్తున్నారని వాపోయారు.
- Suicide Attempt: సత్యసాయి జిల్లాలో విషాదం.. తల్లి, పిల్లల ఆత్మహత్యాయత్నం
Suicide: సత్యసాయి జిల్లా అమడగూరు మండలం చినగానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని తెలుస్తోంది.
- 'మోదీజీ.. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి జైల్లో పెట్టండి'
Delhi Kejriwal news: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తప్పుడు కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సైతం అరెస్టు చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ఒక్కొక్కరిని అరెస్టు చేసే బదులు.. ఆప్ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి జైల్లో పెట్టాలని ప్రధానిని కోరారు.
- బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ముష్కరులు
Jammu kashmir Bank Employee: జమ్ముకశ్మీర్‌లో ఓ బ్యాంకు మేనేజర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలపాలై చనిపోయారు. మరోవైపు, షోపియాన్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
- అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి.. రూ.లక్షల్లో సంపాదన.. ముఠా అరెస్ట్!
international calls into local calls: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి రూ.లక్షలు సంపాదిస్తున్న ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి అనేక సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం టెలిఫోన్ లైన్‌నే అక్రమంగా నిర్మించారని పోలీసులు చెప్పారు.
- IPL 2022: చర్చంతా కోహ్లీ, ఆర్సీబీ గురించే.. నెటిజన్ల రచ్చ రచ్చ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. 15వ సీజన్ కప్పును కొట్టేసింది. అయితే సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్టుగా మాత్రం స్థానం సంపాదించలేకపోయింది. ఈ సీజన్లో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటి బాట పట్టిన బెంగళూరు జట్టుతో పాటు విరాట్ కోహ్లీ గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్నారట. ఆ సంగతేంటో చూద్దాం రండి.
- ఉద్వేగంగా 'మేజర్' జనగణమన పాట.. కిర్రాక్ టైటిల్‌తో షారుక్!
MAJOR JANA GANA MANA: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. అడివి శేష్ 'మేజర్', షారుక్ ఖాన్-అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.