- LOKESH: ఎమ్మెల్సీ డ్రైవరుది హత్యే.. కేసు సీబీఐకి అప్పగించాలి : లోకేశ్
LOKESH: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని సుబ్రహ్మణ్యం కుంటుంబ సభ్యులు అంటున్నా.. ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.
- ఈతకు వెళ్లిన బాలురకు కరెంటు షాక్.. నలుగురు దుర్మరణం!
DIED: ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. సరదా కోసం ఈతకు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా తిరిగి రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- KUNAVARAM: విలీన మండల ప్రజల గో'దారి' కష్టాలు తీరేదెన్నడో..!!
KUNAVARAM: నడుముల్లోతు నీళ్లు.. అక్కడక్కడా ఇసుక తిన్నెలు.. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడేం జరుగుతుందో అంతు చిక్కదు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.. రెండున్నర కిలోమీటర్ల దూరం క్షణమొక యుగంలా ప్రయాణం సాగించాల్సిందే. ఈ కష్టాలు తీరేదెప్పుడో, ప్రయాణం సాఫీగా సాగేదెన్నడో అంటూ.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న విలీన మండలాల గిరిజన ప్రజల దీనస్థితిపై ఈటీవీ- ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
- 'అభివృద్ధే మాకు పరమావధి.. స్వార్థంతోనే ఆ పార్టీల 'విష' రాజకీయం!'
PM Modi News: దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజస్థాన్ జైపుర్‌లో జరుగుతున్న భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.
- బిహార్‌పై వరుణుడి పంజా.. 27 మంది మృతి
Bihar Floods: బిహార్‌ను ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్జ్ జారీ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షానికి అపార నష్టం సంభవించింది. వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో 27 మంది మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను బిహార్ ప్రభుత్వం ముమ్మరం చేసింది.
- స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 2,259 కేసులు నమోదు కాగా, మహమ్మారితో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.
- క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్ వైపు చూస్తారా..?
Major league cricket: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల క్రికెట్ లీగ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి మేజర్ లీగ్ క్రికెట్ పేరుతో అమెరికా నిర్వహించే టీ20 టోర్నీకి 42 మిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. ఇందులో సత్య నాదెళ్లనే కీలక ఇన్వెస్టర్. ఆయన ఇప్పటికే ఓ సాకర్ టీంకు సహ యజమానిగా ఉన్నారు.
- ఫేక్ థంబ్నెయిల్స్కు చెక్.. యూట్యూబ్ నుంచి అదిరే ఫీచర్!
YouTube new features: యూజర్స్‌ను మభ్యపెట్టి వ్యూస్ రాబట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు కొందరు యూట్యూబర్స్. వీడియోలో ఏదో ఉంటే.. థంబ్‌నెయిల్స్‌పై మాత్రం మరేదో పెడుతుంటారు. విసుగు తెప్పించే ఈ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ గోలకు త్వరలో అడ్డుకట్టపడనుంది! ఈ మేరకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదేంటంటే?
- పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
gold rate today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.530 వృద్ధి చెందింది. మరోవైపు కిలో వెండి రూ. 1,147 ఎగబాకింది. క్రిప్టోకరెన్సీలు కూడా లాభాలను నమోదు చేశాయి. నష్టాల్లో ఉన్న బిట్‌కాయిన్ లాభాలబాట పట్టింది.
- 48ఏళ్లయినా ఐశ్వర్య అవే సొగసులు.. కేన్స్‌లో ఐష్ , దీపిక మెరుపులు
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 3వ రోజు విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్, బాలీవడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తళుక్కుమన్నారు. ఎర్రతివాచీపై నడుస్తూ.. తమ అందాలను ఒలకబోశారు. అయితే ఐష్ అందానికి మాత్రం కేన్స్ పులకరించిపోయింది. 48ఏళ్లయినా, ఒక బిడ్డకు తల్లయినా తరగని ఆమె సొగసులకు అతిథులు ఫిదా అయిపోయారు. 20ఏళ్లుగా ఐశ్వర్య కేన్స్‌కు వస్తున్నా.. ఈసారి మాత్రం ప్రత్యేకంగా కనిపించారు.