- BANNERS: అంకాలమ్మ జాతరలో తెదేపా, వైకాపా బ్యానర్లు.. చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
BANNERS: అంకాలమ్మ తల్లి జాతర సందర్భంగా ఊరి ముఖద్వారం వద్ద తెదేపా, వైకాపా తరఫున బ్యానర్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పోటాపోటీగా శుభాకాంక్షలు చెబుతూ కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు.
- JNTUA: యువత వినూత్న ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి: గవర్నర్ బిశ్వభూషణ్
Governor Biswabhusan in convocation of JNTU Anantapur: యువత మేధో సంపత్తిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని.. వినూత్న దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. అనంతపురం జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన.. పట్టభద్రులకు దిశానిర్దేశనం చేశారు. ‘దేశం నాకోసం ఏం చేస్తుందని అడగకుండా.. దేశం కోసం నేనేం చేయగలను’ అనే ధోరణితో యువత ముందుకెళ్లాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
- MASSAGE: మర్దన పేరిట స్నేహితురాలిని రప్పించి.. అలా చేయాలంటూ చిత్రహింసలు
MASSAGE: మర్దన పేరిట దిల్లీ నుంచి పిలిపించిన స్నేహితురాలిని గదిలో నిర్భందించి చిత్రహింసలు పెట్టిన ఘటన తెలంగాణలోని బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు ఎలాగొలా వారి నుంచి బయటపడి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
- Mahesh Bank Case: మహేశ్ బ్యాంక్‌పై సైబర్ దాడికి పాల్పడింది వారే..
Mahesh Bank Server hacking Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు గుర్తించారు. వారికి సంబంధించిన సిమ్ కార్డుల ద్వారా పరిశోధన కొనసాగిస్తున్నారు.
- త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మాణిక్ సాహా. ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిప్లవ్ కుమార్ దేవ్ శనివారం అనూహ్యంగా రాజీనామా చేసిన క్రమంలో మాణిక్ సాహాను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు నేతలు.
- 'హత్య' కేసులో మాజీ మంత్రి కుమార్తె పరార్.. రేప్ కేసులో మంత్రి కుమారుడు...
lift accident death in Tamil Nadu: లిఫ్ట్ ప్రమాదంలో బాలిక మృతి చెందిన కేసులో తమిళనాడు మాజీ మంత్రి కుమార్తెపై కేసు నమోదు కాగా.. ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మరోవైపు.. 23 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో రాజస్థాన్ మంత్రి కుమారుడిని అరెస్ట్ చేసేందుకు జైపుర్ వెళ్లారు దిల్లీ పోలీసులు.
- బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం.. గర్భం దాల్చాక ఇంట్లోనే గుట్టుగా...
కన్న కుమార్తెపై తన ప్రియుడు అత్యాచారం చేసేందుకు అంగీకరించింది ఓ తల్లి. గర్భం దాల్చిన కుమార్తెకు ఇంట్లోనే డెలివరీ చేసింది. చివరకు ప్రియుడితో పాటు కటకటాలపాలైంది. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- ధోనీ చేస్తున్న ఈ వ్యాపారాల గురించి తెలుసా?
Dhoni Farming Bussiness: క్రికెట్ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. రిటైర్మంట్ తర్వాత రైతుగా మారాడు. బ్యాటు పట్టిన చేత్తో విత్తనాలు నాటుతున్నాడు. నిజానికి ఇదంతా ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు చేస్తున్న పనే అయినా మన మిస్టర్ కూల్ మాత్రం వైవిధ్యంగా అడుగులేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందామా!
- KGF 3: నిన్న అలా.. నేడు ఇలా.. ఇంతకీ ఉందా లేదా?
KGF 3 Shooting: 'కేజీయఫ్-3' గురించి వస్తోన్న వరుస కథనాలపై హోంబలే సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. ఏమన్నారో తెలుసుకుందాం..