- పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనన్న స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఏపీకి ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచారణ
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలను 10 రోజుల్లో సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌ను సుప్రీం ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొండకు బోల్టులు.. రాళ్లు జారి పడకుండా శాశ్వత పరిష్కారం
ఇంద్రకీలాద్రి పైనుంచి రాళ్లు జారి కిందపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. దేశంలోని పలు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)కు చెందిన నిపుణులతో కూడిన బృందం దుర్గగుడికి నవంబర్ 2న రాబోతోంది. కొండ మొత్తాన్ని వీళ్లు పరిశీలించనున్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఉండేందుకు ఏమేం చేయాలనే విషయాలన్నింటిపైనా అధ్యయనం చేస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కన్నుమూత
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(92) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కరోనాతో ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ శ్వాసకోశ సమస్య తీవ్రమవటం వల్ల ఆరోగ్య క్షీణించి తదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దిల్లీ కాలుష్య నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్
దిల్లీ వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ గెజిట్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి.. ఈ కమిషన్‌లో పూర్తికాలం ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భూ చట్టాలకు వ్యతిరేకంగా పీడీపీ ఆందోళన- పలువురి అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయటంపై ఆందోళన చేపట్టింది పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ). ప్రభుత్వ నిర్ణయం వల్ల కశ్మీర్లో నేరాలు పెరిగిపోతాయని.. ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చెన్నైలో భారీ వర్షాలు- జనావాసాలు జలమయం
తమిళనాడు రాజధాని చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇళ్లల్లోకి వాన నీరు చేరుకుంది. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమెరికా ముందస్తు గోల- పోస్టల్ బ్యాలెట్లపై కోర్టుల్లో యుద్ధం
అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్‌కు వీలుకల్పించిన పోస్టల్ బ్యాలెట్లపై అమెరికాలో రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల మధ్య ఒకరకంగా యుద్ధం సాగుతోంది. అధికారికంగా నవంబర్ 3న పోలింగ్ అయినప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నమోదవుతోంది. దీంతో.. ముందస్తు ఓటింగ్ శాతం పెరుగుతున్న కొద్దీ, ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయనే భావన రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో.. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- హార్థిక్ పాండ్య, మోరిస్‌కు ఐపీఎల్ కమిటీ హెచ్చరిక
బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మితిమీరి ప్రవర్తించిన హార్థిక్ పాండ్య, మోరిస్‌లను హెచ్చరించిన ఐపీఎల్ కమిటీ.. వారిద్దరూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నాగబాబు పుట్టినరోజు.. మెగాహీరోలు ట్వీట్స్
మెగాబ్రదర్ నాగబాబుకు.. చిరు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ట్విట్టర్ వేదికగా ఫొటోల్ని పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి