ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM - తెలుగు తాజా వార్తలు

...

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 11, 2021, 12:59 PM IST

  • తిరుపతిలో తెదేపా గెలిస్తే మా ఎంపీలు రాజీనామా చేస్తారు: పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా గెలిస్తే.. వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజాహిత కార్యక్రమాలే వైకాపాకు బలమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సీఎం జగన్​కు బుద్ధిచెప్పే అవకాశం ఓటర్లకు వచ్చింది'

తిరుపతి ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్​కు బుద్ధిచెప్పే అవకాశం ఓటర్లకు వచ్చిందని... తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యానవనంలో యువనాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దుర్గగుడి ఆలయాన్ని చుట్టుముడుతున్న వివాదాలు

రాష్ట్రంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఎంత ప్రఖ్యాతిగాంచిందో.. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలతో అంతేస్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. పదేళ్ల కాలంలో 11మంది ఈవోలు మారటం ఆలయ పరిస్థితికి అద్దం పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ' సీఎంను కలవాలని బయలుదేరాడు..మధ్యలోనే మిస్సయ్యాడు'

గ్రామంలో ప్రజలు కష్టపడుతుంటే తాను చూడలేక పోయాడు. విద్యార్థులు బస్సులేక ..పాఠశాలలకు వెళ్లలేక ఇంటికి బాధతో వచ్చినప్పుడు వారి ఆవేదనను అర్థం చేసుకున్నాడు. ఊరి కష్టాలను తన కష్టాలనుకున్నాడు. ఊరు బాగుంటే తాను బాగుంటా అనుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పరిస్థితి తీవ్రం.. ఇళ్లలోంచి బయటకు రావొద్దు'

దిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరాటానికి లాక్​డౌన్​ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లకు సీబీఐ సమన్లు

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లు తమ ముందు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. దేశ్​ముఖ్​పై ఉన్న అవినీతి ఆరోపణల కేసులో.. ఆయన సలహాదార్లు ప్రత్యక్ష సాక్షులని పోలీసు అధికారి పరంవీర్​ సింగ్​ పేర్కొన్న నేపథ్యంలో వారికి సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వీలునామాల దిశగా చైనా యువత.. అందుకేనట!

వీలునామాలు ఎవరైనా ఎప్పుడు రాస్తారు? వయసు అయిపోతుంది అనుకున్నప్పుడు రాస్తారు. కానీ చైనాలో యువత వీలునామాలు సిద్ధం చేసుకుంటున్నారట. ఎందుకో తెలుసా?.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 48 మంది బిలియనీర్లతో టాప్​-10లోకి ముంబయి

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనిక నగరాలపై సర్వే చేపట్టింది పోర్బ్స్​. ఆయా నగరాల్లోని ప్రపంచ బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచంలోని టాప్-10 నగరాల్లో భారత్​లోని ముంబయి 48 మంది బిలియనీర్లతో చోటు దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ధోనీ జట్టుపై గెలవడం సంతోషంగా ఉంది'

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్​ అనంతరం మాట్లాడిన దిల్లీ కెప్టెన్ పంత్.. ధోనీసేనపై విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉగాదికి బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్​ను ప్రకటించేందుకు సిద్ధమైంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.