- పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమల ఆలయంలో... పదవీ విరమణ చేసిన అర్చకులకు మళ్లీ అవకాశం
పదవీ విరమణ పొందిన అర్చకులకు సంబంధించి.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'డీఎంకే-కాంగ్రెస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం'
తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్ కూటమిని ఓడించినప్పుడే.. రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జయలలిత, ఎంజీఆర్ కలలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే నెరవేరుతాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి కోవింద్
రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యంపై రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఫ్గాన్‌లో దాడులు- ఒక్క నెలలో 305మంది మృతి
అఫ్గానిస్తాన్‌లో జరిగిన వివిధ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 20 శాతం పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. వివిధ దాడుల్లో ఒక్క నెలలోనే 305 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్తర కొరియాపై ఆ మూడు దేశాల కీలక నిర్ణయం
అణ్వాయుధాల విషయంలో ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు సహకారాన్ని కొనసాగించాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. ఈ మేరకు మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య జరిగిన భేటీలో అంగీకారం కుదిరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మీ చిన్నారికి బాల్ ఆధార్ కార్డ్ చేయించారా?
చిన్న పిల్లల కోసం బాల్ ఆధార్‌ను తీసుకువచ్చింది భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ). నవజాత శిశువుల నుంచి అయిదేళ్ల లోపు చిన్నారులకు ఈ ప్రత్యేక నీలిరంగు కార్డును ఇవ్వనుంది. దీని దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిగ్గజాల సరసన సిన్నర్- మియామి ఓపెన్ ఫైనల్లో బెర్తు
ఇటలీ టెన్నిస్ సంచలనం జన్నిక్ సిన్నర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో 5-7, 6-4, 6-4తో స్పెయిన్ ప్లేయర్ అగట్పై విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పుష్ప' అప్డేట్.. కిర్రాక్ లుక్‌లో బన్నీ
అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాకు సంబంధించి చిన్న వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోయిగా రష్మిక నటిస్తోంది. ఆగస్టు 13న విడుదల కానుందీ సినిమా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.