ETV Bharat / city

TS Corona Cases: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 1,913 కేసులు

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రెండు వేలకు చేరువలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు కలవరపడుతున్నారు.

TS Corona Cases latest updates
TS Corona Cases latest updates
author img

By

Published : Jan 6, 2022, 9:19 PM IST

TS Corona Cases: తెలంగాణవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య ఇవాళ రెండు వేలకు చేరువైంది. తాజాగా 54,534 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేపట్టగా వారిలో 1,913 మందికి వైరస్ నిర్ధరణ అయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 6,87,456 మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మరో 232 మంది కోలుకోగా... వైరస్ నుంచి మొత్తం 6,75,573 మంది రికవరీ అయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో ఇద్దరు మృతి చెందగా... మహమ్మారితో ఇప్పటివరకు 4,036 మంది మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 7,365 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

జిల్లాల్లో...

తాజాగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ 1,214 కేసులు నమోదవగా.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జగిత్యాల 9, జనగామ 4, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 7, కరీంనగర్ 24, ఖమ్మం 25, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 33, మంచిర్యాల 12, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 161, నాగర్‌కర్నూల్ 2, నల్గొండ 16, నారాయణపేట 1, నిజామాబాద్ 28, పెద్దపల్లి 13, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 213, సంగారెడ్డి 24, సిద్దిపేట 14, సుర్యాపేట 10, వికారాబాద్ 12, వనపర్తి 5, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 24, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున నమోదయ్యాయి. ఇక ఈరోజు మొత్తం 4,55,591 డోసుల టీకాలు పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 547 కరోనా కేసులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.