సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆరిఫా అనే 16 ఏళ్ల బాలికను దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. రాత్రి బాలిక భవనంపై చదువుకున్నట్లు బాలిక బంధువులు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
నిందితుడు అతనేనా..?
రాత్రి బాలిక భవనంపై చదువుకుంటున్న సమయంలో ఎవరో ఆమెను రాయితో కొట్టి కింద పడేశారని బంధువులు చెబుతున్నారు. ఆరిఫాను షోయబ్అనే యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నాడని.. అతనే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: