ETV Bharat / city

rape on minor: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు - telangana news

Rape on 15 Years Old Girl : బహిర్భూమికి వెళ్లిన ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని నిర్మల్​ జిల్లా మామడ మండలంలో జరిగింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

rape on minor
rape on minor
author img

By

Published : Mar 9, 2022, 4:16 AM IST

Rape on Minor Girl: తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. మామడ ఎస్సై అశోక్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మామడ మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక (15) ఈ నెల 6న రాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన 26ఏళ్ల యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ముఖంపై గాయాలు చూసిన బాధితురాలి కుటుంబసభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో మంగళవారం మామడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.