- స్త్రీ రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఎక్కడంటే..?
విఘ్నేశ్వరుడిని అందరూ పురుష రూపంలోని ఉన్న పేర్లుతోనే పిలుస్తారు. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో స్త్రీ రూపంలో పూజిస్తూ, వారి పేర్లుతోనే పిలిచి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతకీ అలా ఎందుకు పిలుస్తారు, ఎక్కడ ఆ ప్రాంతము చూద్దామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "ఒరేయ్ బట్టలూడదీసి కొడతా.. ఊరు వదిలిపోతావా లేదా?"
"ఒరేయ్... బట్టలూడదీసి కొడతా!. ఊరు వదిలిపోతావా.. లేదా.. రికార్డు చేసి సీఎంకు పంపు చూద్దాం." ఇది వైఎస్ కొండారెడ్డి బెదిరింపుల పర్వం. మళ్లీ పులివెందులలోకి ప్రత్యక్షమైన కొండారెడ్డి తమ పార్టీలోని ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "సదుద్దేశంతోనే దండించి ఉండొచ్చు.. తల్లిదండ్రులకు అప్పగించండి"
కన్నబిడ్డను ఓ తల్లి దండించింది. దీనిపై స్పందించిన పోలీసులు, అధికారులు పాపను స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. దీంతో ఆ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. సదుద్దేశంతోనే దండించి ఉండొచ్చని భావించిన న్యాయస్థానం... బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తప్పని ప్రసవ యాతన... నీటిమూటలుగానే సీఎం ప్రకటనలు
రాష్ట్రంలో మహిళలకు ప్రసవ యాతన తప్పడంలేదు. వైద్యులు లేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్తు వైద్య నిపుణుల కొరత సైతం వేధిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తామన్న సీఎం ప్రకటనలు నీటిమూటలుగానే మిగిపోతున్నాయి. చాలాచోట్ల ప్రైవేట్ వైద్యమే దిక్కైంది. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రుల్లో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఘనంగా గణేశ్ చతుర్థి.. గాజుసీసాలో చిన్ని గణపతి.. 3వేల లడ్డూలతో సైకత శిల్పం
విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అవన్నీ నిజాలై సాక్ష్యాత్కరించే పండుగ రోజులు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్‌లో కాస్త తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 7,231 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 45 మంది మరణించారు. ఒక్కరోజులో 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెజాన్ అడవుల్లోని ఆ ఒక్కడు ఇకలేడు..
దక్షిణ అమెరికా.. అమెజాన్ అడవుల్లోని మానవజాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగలో మిగిలిన చిట్టచివరి వ్యక్తి కూడా అంతరించిపోయాడు. 'ఫ్యునాయ్' అనే ఆదిమవాసుల పరిరక్షణ విభాగం అక్కడ నిఘా కెమెరాలు పెట్టి అతడి సంరక్షణపై దృష్టి పెట్టింది. 2018లో ఒకసారి ఒక కెమెరా కంటికి అతడు చిక్కగా.. మళ్లీ అతడి ఆనవాళ్లు కనిపించలేదు. తాజాగా అతడి మృతదేహం కెమెరాలో రికార్డు కావడం విషాదకరం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసేముందు.. ఈ టిప్స్ ఫాలో అవుతున్నారా?
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం కూడా తప్పనిసరి అన్నట్లుగా మారింది. అయితే క్రెడిట్ కార్డు జారీ సంస్థలు తొలుత పెద్ద పెద్ద ఆఫర్లు లేని కార్డును మాత్రమే అందిస్తాయి. క్రమక్రమంగా ఆదాయం పెరుగుతున్న కొద్దీ, క్రెడిట్ స్కోరును బట్టి ప్రత్యేక ప్రయోజనాలు అందించే కార్డుకు అప్‌గ్రేడ్‌కు అవ్వాలని సూచిస్తుంటుంది. అయితే.. కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ముందు ఈ టిప్స్ ఫాలో అవుతున్నారా మరి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రషీద్ రికార్డ్.. ఆ జాబితాలో రెండో స్థానం.. సూపర్-4లో అఫ్గాన్
అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అఫ్గానిస్థాన్ స్ఫిన్నర్ రషీద్ ఖాన్. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. స్పిన్నర్లు చెలరేగడంతో.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్ సూపర్-4లో ప్రవేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానన్న నటుడు సుమన్
తన ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై స్పందించారు ప్రముఖ సినీ నటుడు సుమన్. తాను క్షేమంగా ఉన్నానని అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరులో ఉన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.