- పల్లెలు, పట్టణాల మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర
రాజధాని రైతులు సెప్టెంబరు 12 నుంచి చేపడుతున్న మహా పాదయాత్ర మార్గం దాదాపు ఖరారైంది. హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, కోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బంగారం ఖనిజాన్వేషణ బిడ్లకు సెప్టెంబరు 2తో గడువు ముగింపు
రాష్ట్రంలో బంగారం ఖనిజాన్వేషణ లైసెన్సుల జారీకి బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరిలో ఉత్తర, దక్షిణ క్షేత్రాలు, రొద్దం మండలం బొక్సంపల్లిలో ఉత్తర, దక్షిణ క్షేత్రాలు, కదిరి మండలం జౌకుల పరిధిలో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ క్షేత్రాల్లో ఖనిజాన్వేషణ అనుమతుల జారీకి మార్చిలో గనులశాఖ టెండర్లు పిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోస్టింగ్ ఇచ్చిన ఆరు రోజుల్లో బదిలీ చేయటమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
విజయవాడలోని పటమట నబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చిన రాఘవరావును ఆరు రోజుల్లోనే బదిలీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆ ఉద్యోగిని ఎందుకు వేధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయన బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
వైకాపాకు చెందిన కృష్ణా జిల్లా ఉయ్యూరు జడ్పీటీసీసభ్యురాలు యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నా వైకాపాలో అంతర్గతపోరు, ఆధిపత్యమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో కొత్తగా 9 వేల కరోనా కేసులు, జపాన్, జర్మనీలో లక్షల్లో
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 9,062మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది మరణించగా.. మరో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.57 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.24 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్‌కు షాక్, ఆ ఆఫర్‌కు నో చెప్పిన గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను గులాం నబీ ఆజాద్ తిరస్కరించారు. ఆజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్ వానీని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. అయితే నియమించిన కొద్ది సేపటికే ఆఫర్‌ను ఆజాద్ తిరస్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ భయంతో యువ జంటలకు చైనా సబ్సిడీలు, పన్ను రాయితీలు
చైనాను జననాల రేటు కలవరపెడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని స్థానిక అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యోగులకు యాపిల్ షాక్, 100 మంది రిక్రూటర్లు తొలగింపు
కరోనా తర్వాత ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే నియామకాలను నిలిపివేసిన దిగ్గజ సంస్థలు ఉద్యోగాల్లో కూడా కోతలు పెడుతున్నాయి. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు యాపిల్ కంపెనీ తెలిపింది. మరో దిగ్గజ సంస్థ గూగుల్ కూడా త్వరలోనే ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూడేళ్లలో అమ్మాయిలకు 65 మ్యాచ్‌లు, తొలిసారి ఎఫ్‌టీపీ షెడ్యూల్
రానున్న మూడేళ్లలో భారత మహిళల క్రికెట్ జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తొలిసారిగా మహిళల క్రికెట్లో రూపొందించిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) 2022-2025 చక్రాన్ని మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ మూడేళ్ల ఎఫ్‌టీపీలో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20లతో కలిపి మొత్తం 301 మ్యాచ్‌లు జరుగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ బ్యూటీ, ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్
పెళ్లి చూపులు రియాలిటీ షోతో బుల్లితెరపై సందడి చేసిన యువ నటి షబీనా షేక్. 'నా పేరు మీనాక్షి', 'అత్తారింటికి దారేది', 'కస్తూరి' సీరియల్‌తో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆమె.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో మరింత పాపులర్ అయింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ.. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.