- 860 ఎకరాలు కేటాయింపు
రిటైల్ రంగంలో 2026 నాటికి రూ.5 వేల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించి..50 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఏపీ రిటైల్ పార్కు 2021-26 పాలసీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రత్యక్ష ఉపాధే లక్ష్యం!
రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. 50 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలన్నదే తమ ధ్యేయమని వెల్లడించింది. అయిదేళ్ల పాటు అమలులో ఉండే ‘ఏపీ రిటైల్ పార్కు పాలసీ 2021-26’ని రూపొందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 21,458 క్యూసెక్కుల ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్టుకు 21, 458 క్యూసెక్కుల ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి వస్తోంది. ప్రస్తుత నీటిమట్టం 806.80 అడుగులకు చేరగా... నీటినిల్వ 32.468 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రైవేటు బస్సు బోల్తా
కుక్కను తప్పించబోయిన ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం వద్ద జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 38,949 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 38,949 కేసులు(Corona Cases) నమోదయ్యాయి. మరో 542 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లష్కరే ఉగ్రవాదులు హతం
భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 39 కోట్ల టీకా డోసుల పంపిణీ
40 కోట్ల 31లక్షల డోసులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటిదాకా 39కోట్ల డోసులను పంపిణీ చేయగా.. మరో 1.92 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతరించిపోతున్న పాముల జాతులు!
భూమిపై ఏ జాతి ఉనికి కోల్పోయినా మానవ మనుగడకు భంగం కలుగుతుంది. అలాగే రైతు నేస్తంగా పిలిచే.. పర్యావరణానికి ఎంతో మేలుచేసే పాముల జాతులు శరవేగంగా అంతరించిపోతున్నాయి. ఈ జాతులు క్షీణిస్తే ఎదురయ్యే అనర్థాలు పర్యావరణవేత్తలను కలవరపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిన్నారి కోసం ఒలింపిక్స్‌కు
ఒలింపిక్స్(Olympics)లో పోటీపడనున్నట్లు తెలిపాడు టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic). త్వరలోనే తన జాతీయ జట్టు సెర్బియాతో కలవబోతున్నట్టు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాట కోసం రూ.3 కోట్ల బడ్జెట్!
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'(RRR).. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో ఓ పాట కోసం దాదాపుగా రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఆ పాటలో బాలీవుడ్ నటి అలియా భట్ పాల్గొంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.