- " class="align-text-top noRightClick twitterSection" data="">
- భారీగా భద్రత పెంపు
పులిచింతల ప్రాజెక్టు నుంచి విధివిధానాలకు భిన్నంగా తెలంగాణ అధికారులు జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం నీటిని వినియోగించి దిగువకు వదిలేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదం దృష్ట్యా పులిచింతల ప్రాజెక్టు వద్ద పోలీసుల భారీగా మోహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
ఆంధ్రప్రదేశ్ తక్షణమే ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రామ సచివాలయానికి తాళం!
ప్రకాశం జిల్లాలో ఒక గ్రామ సచివాలయానికి భవనం యజమాని తాళం వేశారు. 13 నెలలుగా అద్దె చెల్లించడం లేదని విసుగు చెంది.. గత్యంతరం లేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సామాన్య భక్తుల నిరీక్షణ
శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వ దర్శనం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యామని ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 48,786 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. 61,588 మంది కోలుకోగా 1005 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా బుధవారం 27,60,345 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మారాలి పోలీసు ధోరణి
పోలీస్ కస్టడీలో బడుగు బలహీన వర్గాలు ఏటా వందల సంఖ్యలో మరణిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సరైన సమాచారం సేకరించడానికి పోలీసులు అనేక రకాల హింసాత్మక ప్రక్రియలను ప్రయోగిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రైతులకు సీఎం వార్నింగ్
యూపీ- దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమకారులకు, భాజపా కార్యకర్తలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహిస్తోంది కదా అని అన్నదాతలు హద్దులు మీరొద్దని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సత్వరన్యాయం.. తక్షణావసరం!
గత కొన్ని దశాబ్దాలుగా వివిధ రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సంభవించినా, న్యాయస్థానాల తీర్పుల వేగం పెరగలేదు. ప్రస్తుతం మన కోర్టుల్లో 44 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 2022 చివరికి అవి 50 కోట్లను దాటిపోనున్నాయి. వీటిని వేగంగా పరిష్కరించి తీర్పులు ఇవ్వాలంటే, మొదట న్యాయమూర్తుల పదవుల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అదిరిపోయే రికార్డు
భారత సంతతి చిన్నారి అభిమన్యు మిశ్రా.. అత్యంత తక్కువ వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న పోటీల్లో గెలిచి, ఈ ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.100కోట్ల బడ్జెట్‌తో..
భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు స్టార్ హీరో కమల్‌హాసన్ సిద్ధమవుతున్నారు. తమిళ ప్రముఖ దర్శకుడు, ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.