- విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) కాసేపట్లో విశాఖకు రానున్నారు. రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. విశాఖలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డైరెక్టర్ల ఛాంబర్లకు తాళాలు!
మంగళగిరిలోని ఎన్నారై వైద్య కళాశాలలో ఒక వర్గం డైరెక్టర్లను వారి ఛాంబర్లలోకి వెళ్లకుండా మరో వర్గం అడ్డుకోవడం, వారి నివాస క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిణామాలపై పోలవరపు రాఘవరావు అధ్యక్షుడిగా ఉన్న కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేడుకలో వ్యభిచారం..
ఆ ముగ్గురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు వచ్చింది. బాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఓ హోటల్లో గదులు బుక్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ముగ్గురు కాల్ గర్ల్స్ ను బెంగళూరు నుంచి పిలిపించారు. ఇంతలో పోలీసులకు సమాచారం వెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సినీనటుడు కత్తిమహేష్‌కు గాయాలు
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీనటుడు కత్తి మహేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై లారీని కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 50వేల దిగువకు కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 48,698 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 1,183 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీలో హై అలర్ట్!
జూన్ 26న దిల్లీలో రైతులు చేపట్టనున్న ఆందోళనల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నలిగిపోతున్న దేశం'
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా.. తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ పాలనలో గత ఏడేళ్లుగా దేశంలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని, ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడ్డాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్
రాజధాని ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలోని సొరంగంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూఏఈలో టీ20 ప్రపంచకప్..
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో జరిపేందుకు సిద్ధమైందట బీసీసీఐ. భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అగ్ర కథానాయకులతో సినిమాలు
నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టి.. సినిమాల్లో హీరోగా నటిస్తున్న యువ కథానాయకుడు హవీష్.. త్వరలో అగ్రకథానాయకులతో సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘నువ్విలా’ చిత్రంతో కథానాయకుడిగా మారిన హవిష్... ‘రాక్షసుడు’ చిత్రంతో నిర్మాతగానూ విజయాన్ని అందుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.