- షార్ నుంచి 12 వేల కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా
నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. షార్ నుంచి 12 వేల కిలో లీటర్ల ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కురుపాంలో ఏనుగుల దాడిలో మహిళ మృతి
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను, వారు పండించిన పంటను నాశనం చేస్తున్నాయి. ఈరోజు ఉదయం పాత కళ్లికోట గ్రామానికి చెందిన మహిళ తన పొలంలో కూరగాయలు కోయడానికి వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందింది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో ఆరుగురు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 21 అనాథ మృతదేహాలకు ఎమ్మెల్యే దహన సంస్కారాలు
కొవిడ్ బారినపడి తిరుపతిలో ఆయువు వదిలేసిన అనాథల అంతిమ సంస్కారాలు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. 21 అనాథ మృతదేహాలకు బుధవారం అంతిమ సంస్కారాలు జరిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్ బలహీనమైనదే'
దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా ప్రస్తుతం కొత్త వైరస్ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్.440K రకం వైరస్‌పై పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా ప్రచురితం కాలేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు
దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. దాదాపు 4 వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనాతో ఆర్ఎల్డీ చీఫ్ మృతి- మోదీ సంతాపం
ఆర్ఎల్డీ పార్టీ అధినేత అజిత్ సింగ్ కరోనాతో మరణించారు. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మురికివాడల్లో టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్- వీడియో వైరల్
మహారాష్ట్ర థానేలోని మురికివాడల్లో నివాసం ఉండే మహిళలకు ఆర్టీపీసీ-ఆర్ టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్ పనిని అప్పగించాడో కాంట్రాక్టర్. అయితే.. ఈ పనుల్లో నిమగ్నమైన మహిళలు, పిల్లలు కొవిడ్ నిబంధనలను పాటించకుండానే ప్యాకింగ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'వైద్య పరికరాలు భారత్‌కు చేర్చిన వారి కృషి ప్రశంసనీయం'
కొవిడ్ విపత్కర పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు వైద్య పరికరాలను సాయంగా అందించింది అమెరికా. నాలుగు విమానాల్లో వైద్య పరికరాలు పంపించింది. అయితే.. ఈ ప్రక్రియలో పాల్గొన్న వారి కృషిని ప్రశంసించారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐపీఎల్ వాయిదా.. వీరికి మాత్రం సంతోషమే!
కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. ఇది కొందరికి బాధ కలిగిస్తుంటే మరికొందరు క్రికెటర్లు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఇందుకు కారణం వీరు ఫామ్‌లో లేకపోవడమే. వారెవరో చూద్దాం.
- తారల పాలిట శాపంగా మారిన కరోనా!
కరోనా కారణంగా పలువురు సెలబ్రిటీల కుటుంబాల్లో విషాదం నెలకొంది. వారికి సంబంధించిన వ్యక్తుల్ని కొవిడ్-19 పొట్టన పెట్టుకుంది. ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన సెలబ్రిటీ కుటుంబీకులు ఎవరో చూద్దాం.