రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,972 మంది నమూనాలు పరీక్షించగా 1,002 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,508 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి