- ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు
విజయనగరంలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ చికిత్స అందుతోంది: సోమిరెడ్డి
రాష్ట్రంలో వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ చికిత్స అందుతుందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీకాళహస్తీశ్వరాలయంలో కరోనా నివారణ చర్యలు.. తగ్గిన భక్తుల రద్దీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు అప్రమత్తమై.. నివారణ చర్యలు చేపడుతున్నారు. ఆలయ ఆవరణంలో తరచూ రసాయనాలను పిచికారి చేస్తున్నారు. మాస్కులు తప్పనిసరి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంగం డెయిరీలో నాలుగో రోజూ కొనసాగుతున్న సోదాలు
సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్ అరెస్టైన విషయం తెలిసిందే.
- ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన
మహారాష్ట్ర ఠాణెలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కొవిడ్ రోగులు చనిపోయారు. దీంతో మృతుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జస్టిస్ శాంతనగౌడర్ మృతి పట్ల సుప్రీంకోర్టు సంతాపం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శాంతనగౌడర్ మృతి పట్ల.. అత్యున్నత ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంతాపం తెలిపారు. సుప్రీంలో సోమవారం కేసుల విచారణను వాయిదా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌కు అండగా ఉంటామని పిచాయ్, నాదెళ్ల హామీ
కరోనా విలయంతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు.. గూగుల్ భారీ సహాయాన్ని ప్రకటించింది. వైద్య పరికరాల కొనుగోలుకు రూ.135 కోట్ల విరాళాలు సమకూర్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేజీ డీ-6 రెండో క్లస్టర్ నుంచి రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
కృష్ణా-గోదావరి బ్లాక్‌లోని శాటిలైట్ క్లస్టర్ నుంచి సహజవాయువు ఉత్పత్తిని ప్రారంభించినట్లు రిలయన్స్ వెల్లడించింది. బ్రిటన్ గ్యాస్ కంపెనీ 'బీపీ'తో కలిసి ఈ ఉత్పత్తి చేపట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా భయాలు- ఐపీఎల్‌ను వీడుతున్న ఆసీస్ క్రికెటర్లు!
ఐపీఎల్ మధ్యలో నుంచి ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆండ్రూ టై.. తన స్వస్థలం ఆస్ట్రేలియా వెళ్లడానికి సిద్ధమవ్వగా.. ఇప్పుడు ఆర్సీబీ ఆటగాళ్లు జంపా, రిచర్డ్సన్ కూడా సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనసూయ కొత్త సినిమా నేరుగా ఓటీటీలో
అనసూయ, విరాజ్ అశ్విన్, మోనిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'థాంక్యూ బ్రదర్' ఓటీటీలో విడుదల కానుంది. ఇందులో అనసూయ గర్భిణిగా నటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.