ETV Bharat / business

TVS X Electric Scooter Launch : స్టన్నింగ్​ లుక్​తో టీవీఎస్ ఎలక్ట్రిక్​ బైక్​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 140 కి.మీ మైలేజ్​..

TVS X Electric Scooter Launch : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ రెండో విద్యుత్తు స్కూటర్‌ను బుధవారం లాంచ్‌ చేసింది. కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో ఉన్న ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.2.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్స్​తో బైక్​ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, రేంజ్​, ధర తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

TVS X EV Specs And Features And Specifications
TVS Xonic E-Scooter Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 2:59 PM IST

TVS X Electric Scooter Launch : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్​ మోటార్స్​ కంపెనీ మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్​ను లాంఛ్​ చేసింది. 'టీవీఎస్​ Xonic'( TVS Xonic Electric Scooter )పేరుతో ఆగస్టు 23(బుధవారం) రాత్రి ఈ ప్రీమియం ఈ-స్కూటర్‌​​ను భారత విపణిలోకి అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక హంగులతో టీవీఎస్ లాంఛ్​ చేసిన ఈ ఈవీ ప్రారంభ ధరను అక్షరాల రూ.2,49,900(బెంగళూరు ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించారు. దాదాపు రెండున్నర లక్షలు ప్రైజ్​ ట్యాగ్​తో వచ్చిన ఈ స్కూటర్​లో ధరకు తగ్గట్లే ఫీచర్స్​ను కూడా ఇన్​బిల్ట్​ చేశారు. దీంతో ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఇతర సంస్థల ఎలక్ట్రిక్​ స్కూటర్​లకు ఇది కచ్చితంగా పోటీ ఇవ్వనుందని బైక్​ లవర్స్​ అభిప్రాయపడుతున్నారు.

ఫీచర్లు​- స్పీడ్​- రేంజ్​..!
TVS X Electric Features : టీవీఎస్​ తీసుకువచ్చిన ఈ నయా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఎక్కువగా స్పీడోమీటర్​పై ఫోకస్ చేశారు. దీంతో ఇది గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే దీని రేంజ్​ 63 కి.మీ వరకు ఉంటుందని తెలిపింది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు నేవిగేషన్‌ సిస్టం, ఈవీ( TVS E Scooter )ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజమ్‌, లైవ్‌ వెహికల్‌ లొకేషన్ షేరింగ్‌ వంటి స్టన్నింగ్​ ఫీచర్స్​ ఈ బైక్​లోని ప్రత్యేకతలని పేర్కొంది.

ఎక్స్​ట్రా ఫీచర్స్​..

  • 3.8 kWh బ్యాటరీ.
  • స్టెల్త్, ఎక్స్‌ట్రైడ్‌, ఎక్సోనిక్‌ మోడ్స్‌.
  • 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
  • ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
  • గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్​ చేయొచ్చు.
  • ఇక స్కూటర్‌ భద్రత కోసం నెక్ట్స్‌-జెనరేషన్‌ ABSను కూడా ఇచ్చారు.
  • 3 kW ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే కేవలం గంట వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇతరులు యాక్సెస్​ చేయకుండా..
TVS X EV Specifications : ఈ స్కూటర్ కొనుగోలులో భాగంగా 950W పోర్టబుల్‌ ఛార్జర్‌ను రూ.16,275కే అందిస్తామని కంపెనీ తెలిపింది. 3-KW స్మార్ట్ హోమ్ ఛార్జర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. వెల్‌నెస్, గేమింగ్, బ్రౌజింగ్, లైవ్ వీడియో ఫీచర్‌లను అందించే ప్లే టెక్‌తో ఈ స్మార్ట్ స్కూటర్ వస్తోంది. ఈ 'TVS X'ను స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, హెల్మెట్‌లతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇతరులు యాక్సెస్‌ చేయకుండా ఉండేందుకు ఇన్​స్టాల్​ చేసిన స్మార్ట్ షీల్డ్‌ భద్రతా ఫీచర్‌ ఇందులో( TVS Motor Electric Scooter )ని స్పెషాల్టీ. కాగా, ఇప్పటికే ఈ ప్రీమియం స్కూటర్​ను బుక్​ చేసుకున్న వారికి నవంబరు నుంచి డెలివరీలు అందిస్తామని టీవీఎస్‌ స్పష్టం చేసింది.

Godawari E Scooter Launch : గోదావరి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్​ లాంఛ్​.. ఫీచర్స్​ అదుర్స్​.. ధర ఎంతంటే?

KTM Duke New Model 2023 : అదిరే ఫీచర్స్​తో నయా కేటీఎం డ్యూక్​ బైక్స్ ​.. ధర ఎంతంటే?

Hero Scooter New Model 2023 : హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్​ లాంఛ్​.. ఫీచర్స్​ అదుర్స్​.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.