ETV Bharat / business

TVS Motor Bike Launch : టీవీఎస్​ రైడర్​ సూపర్​ స్క్వాడ్ బైక్​ లాంఛ్​.. ధర ఎంతంటే? - లేటెస్ట్ బైక్స్​

TVS Motor Bike Launch In Telugu : టీవీఎస్​ మోటార్​ కంపెనీ భారత మార్కెట్​లో రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్​ బైక్​ను లాంఛ్ చేసింది. దీని ధర, ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

TVS Raider Super Squad Edition Launched in India
TVS Motor Bike Launch
author img

By

Published : Aug 12, 2023, 3:04 PM IST

TVS Motor Bike Launch : టీవీఎస్​ మోటార్​ కంపెనీ భారత మార్కెట్​లో మరో సరికొత్త​ బైక్​ను లాంఛ్ చేసింది. టీవీఎస్​ రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్​ బైక్​ను మార్వెల్​ సూపర్​ హీరోస్..​ బ్లాక్​ పాంథర్​, ఐరెన్ మ్యాన్ పాత్రల​ ప్రేరణతో రూపొందించడం జరిగింది.

టీవీఎస్​ రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్​ ఫీచర్స్
TVS Raider Super Squad Edition : ఈ బైక్​లో 124.8సీసీ ఎయిర్​-కూల్డ్​ పెట్రోల్​ ఇంజిన్ ఉంది. ఇది 7,500 ఆర్​పీఎం వద్ద 11.2 పీహెచ్​పీ పవర్; 6,000 ఆర్​పీఎం వద్ద 11.2 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్​ 5 స్పీడ్​ గేర్​బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది.

టీవీఎస్​ మోటార్​.. రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్ బైక్​ ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు.. సైలెంట్​ మోటార్​ స్టార్టర్​తో పాటు, ఐడ్లింగ్ స్టాప్​-స్టార్ట్​ సిస్టమ్​ను వినియోగించింది. టీవీఎస్​ రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్​ మోటార్​ సైకిల్​లో ట్యూబ్​ లెస్​ టైర్లు ఉన్నాయి. ఈ బైక్​ 17 అంగుళాల అల్లాయ్​ వీల్స్ కలిగి ఉండి.. ముందు భాగంలో 80/100 టైర్​​, వెనుక భాగంలో 100/90 టైర్​ కలిగి ఉంది.

కలర్​ వేరియంట్స్​
TVS Raider Super Squad Edition Color Variants : టీవీఎస్​ ఈ నయా బైక్​లను మార్వెల్​ సూపర్ హీరోస్​ పాత్రల ప్రేరణతో రూపొందించింది. బ్లాక్​ పాంథర్​ పాత్ర ప్రేరణతో నలుపు రంగు బైక్​, ఐరెన్ మ్యాన్​ పాత్ర ప్రేరణతో ఎరుపు రంగు బైక్​ను రూపొందించడం జరిగింది. అయితే ఇది టీవీఎస్​ కంపెనీకి కొత్తేమీ కాదు. గతంలోనూ టీవీఎస్​.. థోర్​, ఐరన్​మ్యాన్​, బ్లాక్ పాంథర్​, స్పైడర్​మ్యాన్ లాంటి మార్వెల్​​ హీరోస్​ ప్రేరణతో నాలుగు కలర్​ వేరియంట్స్ గల ఎన్​టార్క్​ 125 స్కూటర్లను మార్కెట్​లోకి తీసుకొచ్చింది.

టీవీఎస్​ రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్​ ధర
TVS Raider Super Squad Edition Price : టీవీఎస్​ టీవీఎస్​ రైడర్​ సూపర్​ స్క్వాడ్​ ఎడిషన్​ ధర దిల్లీలో రూ.98,919 (ఎక్స్​-షోరూం ధర)గా ఉంది. ఇది భారతదేశంలోని అన్ని టీవీఎస్​ మోటార్ టచ్​పాయింట్స్​లో అందుబాటులో ఉంటుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.