ETV Bharat / business

Tata To Make IPhones In India : ఐఫోన్.. ఇక మేడ్ బై టాటా! భారత్​లో తయారీతో ధరలు తగ్గుతాయా? - టాటా విస్ట్రాన్ లెటెస్ట్​ న్యూస్​

Tata To Make IPhones In India : ఐఫోన్లను ఇక టాటా గ్రూప్ తయారు చేయనుంది. భారత్​లో ఉన్న ఐఫోన్ ప్లాంట్​ను టాటా గ్రూప్‌కు అమ్మేందుకు విస్ట్రాన్ బోర్డు ఆమోదం తెలిపింది. సుమారు 125 మిలియన్ల డాలర్లకు ఈ డీల్​ కుదిరింది. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది విస్ట్రాన్ బోర్డు. కేంద్ర ఐటీ మినిస్టర్​ కూడా ట్విట్టర్​లో ఓ పోస్ట్​ చేశారు.

Tata To Make IPhones In India
భారత్​లో ఐఫోన్​లు తయారు చేయనున్న టాటా గ్రూప్​
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 6:03 PM IST

Updated : Oct 27, 2023, 6:56 PM IST

Tata To Make IPhones In India : భారత్​లో ఐఫోన్​లను ఇక టాటా గ్రూప్ తయారు చేయనుంది. దేశీయంగా ఐఫోన్​లను​ తయారు చేసే విస్ట్రాన్ సంస్థకు, టాటా గ్రూప్​కు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కర్ణాటకలో ఉన్న ఐఫోన్ తయారీ ప్లాంట్​ను.. టాటా గ్రూప్‌కు అమ్మేందుకు విస్ట్రాన్ బోర్డు అంగీకరించింది. సుమారు 125 మిలియన్ల డాలర్లకు ఈ డీల్​ కుదిరింది. దీంతో మొదటి భారతీయ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్​ నిలవనుంది. ఈ ఒప్పందానికి సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది విస్ట్రాన్ బోర్డు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్టర్​ రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్విట్టర్​లో ఇదే విషయమై పోస్ట్​ చేశారు.

"పీఎల్ఐ ప్రోత్సాహక పథకంతో భారత్‌ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ తయారీ, ఎగుమతులకు నమ్మకమైన, ప్రధాన హబ్‌గా మారుతోంది. ఇక, రానున్న రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ కోసం టాటా గ్రూప్‌ భారత్‌లో ఐఫోన్‌ తయారీని ప్రారంభించనుంది. విస్ట్రాన్‌ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేసిన టాటా సంస్థకు అభినందనలు" అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు.

  • PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports.

    Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL

    — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం విస్ట్రాన్‌ సంస్థ కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తోంది. ఇది తైవాన్​కు చెందిన కంపెనీ. ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని భావించిన టాటా గ్రూప్‌.. విస్ట్రాన్‌ సంస్థతో ఏడాది పాటు చర్చలు జరిపింది. మొదట జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్లాంట్​ కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం విస్ట్రాన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో టాటా కొనుగోలు ఆఫర్‌కు ఆమోదం లభించింది. కర్ణాటకలోని విస్ట్రాన్‌ ప్లాంట్‌లో 100శాతం వాటాలను.. టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అమ్మేందుకు ఒప్పందం కుదిరింది.

ఈ ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఐఫోన్‌ 14 మోడల్‌ అసెంబ్లింగ్‌ను చేపడుతున్నారు. ఇందులో సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఐఫోన్ల తయారీని పెంచుకుంటూ వచ్చిన విస్ట్రాన్‌ కార్ప్‌.. 2024 మార్చి నాటికి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా శ్రామిక శక్తిని సైతం మూడు రెట్లు చేయాలని విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. ఈ డీల్​తో భారత్‌ నుంచి విస్ట్రాన్‌ నిష్క్రమిస్తే.. అనంతరం ఈ హామీలను టాటా గ్రూప్‌ కొనసాగిస్తుందని సమాచారం.

భారత్​లో ఐఫోన్ల తయారీ మూడింతలు.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు!

భారత్​పై యాపిల్​ కన్ను.. ఐఫోన్​ తయారీలో మన హవా ఎంత?

Last Updated : Oct 27, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.