ETV Bharat / business

Tata Punch Specs Leak : లాంఛ్​కు ముందే టాటా పంచ్​ సీఎన్​జీ స్పెక్స్​ లీక్​.. బెస్ట్ ఫీచర్స్ ఏమిటంటే? - tata punch rivals

Tata Punch CNG Specs Leak : భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ త్వరలో పంచ్​ సీఎన్​జీ వేరియంట్​ను మార్కెట్​లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే లాంఛ్​కు ముందే కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్ లీక్​ అయ్యాయి. అవేంటో చూద్దాం రండి.

Tata Punch CNG Specs Leak
Tata Punch to Offer Sunroof CNG Specs Leaked Ahead of Launch
author img

By

Published : Jul 29, 2023, 3:07 PM IST

TATA Punch CNG Sunroof Specs leak : దేశీయ ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్.. పంచ్​ సీఎన్​జీని త్వరలో ఇండియన్​ మార్కెట్​లో విడుదల చేయనుంది. అయితే లాంఛ్​కు ముందే ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ కారు స్పెసిఫికేషన్స్​ లీక్​ అయ్యాయి.

పోటీకి సిద్ధం!
TATA Punch Rivals : టాటా మోటార్స్​ ఇప్పుడు 'పంచ్ సీఎన్​జీ'ని.. సన్​రూఫ్​ వేరియంట్​తో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న సిట్రోయెన్​, హ్యుందాయ్​లకు పోటీగా దీనిని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టాటా మోటార్స్..​ అకాంప్లిష్​ డాజిల్​ ట్రిమ్​ సహా దానిపైన ఉన్న అన్ని వేరియంట్లలో సన్​రూఫ్​ను అందించడానికి సిద్ధంగా ఉంది.

ఛాయిస్​ మనదే!
TATA Punch CNG Variants : టాటా పంచ్​ పెట్రోల్​ కారు ఎంచుకున్నా లేదా పెట్రోల్​+సీఎన్​జీ వెర్షన్​ ఎంచుకున్నా.. వాటిలో సన్​రూఫ్​ వేరియంట్స్​ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్ కారు​ మాత్రమే సన్​రూఫ్​ను అందిస్తున్న ఏకైక పోటీదారుగా ఉంది. కానీ టాటా పంచ్​ రాకతో దానికి గట్టి పోటీ ఎదురుకానుంది.

స్పెక్స్ లీక్​
TATA Punch CNG Specifications : లీక్​ అయిన టాటా పంచ్​ సీఎన్​జీ స్పెసిఫికేషన్స్​ ఏమిటంటే.. టాటా పంచ్​లో అల్ట్రోజ్​ కారు మాదిరిగానే ట్విన్​ సిలిండర్​ లేఅవుట్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ కారులో సీఎన్​జీ కిట్​తో సహా.. 1.2లీటర్​ ఎన్​ఏ 3 సిలిండర్​ ఇంజిన్​ కూడా ఉంటుంది. ఇది పెట్రోల్​తో నడిచేటప్పుడు 87బీపీహెచ్​ పవర్​, 115 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేస్తుంది. ఇదే ఇంజిన్​ సీఎన్​జీతో నడిచేటప్పుడు 72 బీపీహెచ్​ పవర్​, 102 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. టాటా పంచ్​ కారులో 5 స్పీడ్​ మాన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఇది మంచి ట్రాన్స్​మిషన్ విధులను నిర్వహిస్తుంది.

Tata Punch CNG
టాటా పంచ్​ సీఎన్​జీ కారు సన్​రూఫ్ వేరియంట్​

లీకైన సమాచారం ప్రకారం
TATA Punch CNG Specs : టాటా మోటార్స్​.. ప్యూర్​ రిథమ్ ట్రిమ్​, ప్యూర్​, అడ్వెంచర్​, అడ్వెంచర్​ రిథమ్​, అకాంప్లిష్డ్​, అకాంప్లిష్డ్​ డాజిల్​ మినహా.. మిగతా అన్ని పంచ్ వేరియంట్లలో సీఎన్​జీని అందించాలని చూస్తోంది. కానీ టాటా పంచ్​ కామో ఎడిషన్​తో మాత్రం సీఎన్​జీని అందించదు.

టాటా పంచ్​ ధర
TATA Punch CNG With Sunroof Price : టాటా మోటార్స్ .. ఈ పంచ్​ సీఎన్​జీ వేరియంట్​ కారు ధరను రూ.10.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సన్​రూఫ్​ కావాలనుకుంటే అదనంగా రూ.45,000 చెల్లించాల్సి ఉంటుంది. టాటా పంచ్​ అనేది మార్కెట్​లోకి విడుదల అయితే.. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

TATA Punch CNG Sunroof car
టాటా మోటార్స్ సీఎన్​జీ

టాటా పంచ్​ స్పెక్స్ అండ్ ఫీచర్స్​
TATA Punch CNG Features : టాటా పంచ్​లో రెండు సీఎన్​జీ సిలిండర్లు ఉన్నాయి. అలాగే మంచి బూట్​ స్పేస్​ కూడా ఉంది. దీనిలో ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉంటుంది. ఆటోమేటిక్​ క్లైమేట్ కంట్రోల్​​, హైట్​ అడ్జస్టబుల్​ డ్రైవింగ్​ సీట్​, 7 అంగుళాల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ ఉంటుంది. భద్రత ప్రమాణాల విషయానికి వస్తే టాటా పంచ్​లో ఆరు ఎయిర్​బ్యాగులు ఉంటాయి. ప్రొజెక్టర్​ హెచ్​ ల్యాంప్​ ఉన్న ఈ కారు 16 అంగుళాల ఆలాయ్​ వీల్స్​పై నడుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.