ETV Bharat / business

అధిక వడ్డీ ఇచ్చే స్పెషల్ FD​ స్కీమ్స్​ ఇవే! కొద్ది రోజులే ఛాన్స్​! - IDBI Utsav FD interest rate for senior citizen

Special FD Schemes With High Interest Rates In 2023 In Telugu : మీ పెట్టుబడులు సురక్షితంగా ఉండాలా? మంచి వడ్డీ రేటు కూడా కావాలా? అయితే ఇది మీ కోసమే. ఎస్​బీఐ, ఐడీబీఐ బ్యాంక్​, ఇండియన్​ బ్యాంకులు అధిక వడ్డీ రేటుతో స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​లను అందిస్తున్నాయి. త్వరలోనే వీటి గడువు ముగియనుంది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

IDBI Utsav FD Scheme
SBI Amrit Kalash FD Scheme
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 7:17 PM IST

Special FD Schemes With High Interest Rates In 2023 : బ్యాంకులు.. సీనియర్ సిటిజన్లకు, సాధారణ పౌరులకు మంచి వడ్డీ రేటుతో స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. వాటిలో ఎస్​బీఐ, ఐడీబీఐ, ఇండియన్​ బ్యాంక్ స్కీమ్​లు కూడా ఉన్నాయి. అవి:

  1. ఎస్​బీఐ అమృత్ కలశ్​ ఎఫ్​డీ స్కీమ్​ (400 రోజులు)
  2. ఐడీబీఐ ఉత్సవ్ ఎఫ్​డీ స్కీమ్​ (375 రోజులు & 444 రోజులు)
  3. ఇండియన్ బ్యాంక్​ ఇండ్​ సూపర్​ ఎఫ్​డీ స్కీమ్​ (400 రోజులు)

ఈ స్పెషల్ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్స్​లో చేరేందుకు ఉన్న గడువు డిసెంబర్​ 31తో ముగియనుంది. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

SBI Amrit Kalash FD Scheme : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) 'అమృత్ కలశ్​' పేరుతో స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్​ స్కీమ్​ను అందిస్తోంది. ఈ స్కీమ్ కాలవ్యవధి 400 రోజులు. దీని గడువు ఈ డిసెంబర్ 31తో ముగియనుంది.

ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్​లో గరిష్ఠంగా 7.10% వరకు వడ్డీ రేటు ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లకు, స్టాఫ్​కు​, స్టాఫ్ పెన్షనర్లకు 7.6 శాతం వరకు వడ్డీ ఇవ్వడం జరుగుతుంది.

IDBI Utsav FD Scheme : ఐడీబీఐ బ్యాంక్ ఫెస్టివ్ ఆఫర్​ కింద 'ఉత్సవ్​ ఫిక్స్​డ్ డిపాజిట్​' స్కీమ్​ను అందిస్తోంది. ఈ పథకంలో చేరడానికి ఆఖరి తేదీ 2023 డిసెంబర్ 31. ఐడీబీఐ ఈ స్పెషల్​ ఫిక్స్​డ్​ స్కీమ్​ను 375 రోజులు, 444 రోజుల కాలవ్యవధిలతో అందిస్తోంది.

  • ఐడీబీఐ 375 రోజుల ఉత్సవ్ ఎఫ్​డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులకు/ ఎన్​ఆర్​ఈ/ ఎన్​ఆర్​ఓలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని ఇస్తోంది.​
  • ఐడీబీఐ 444 రోజుల ఉత్సవ్ ఎఫ్​డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులకు/ ఎన్​ఆర్​ఈ/ ఎన్​ఆర్​ఓలకు 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఇస్తోంది.​

Indian Bank IND Super 400 Days :
ఇండియన్ బ్యాంక్​ 'ఇండ్​ సూపర్​ 400 డేస్' పేరుతో స్పెషల్​ టెర్మ్ డిపాజిట్​​ స్కీమ్​ను అందుబాటులోకి తెచ్చింది. ​400 రోజుల కాలవ్యవధి గల ఈ డిపాజిట్​ స్కీమ్​లో.. కనిష్ఠంగా రూ.10 వేలు నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్లు వరకు పొదుపు చేయవచ్చు. ఈ స్కీమ్​లో చేరిన సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తారు. సూపర్ సీనియర్లకు ఏకంగా 8 శాతం వరకు వడ్డీ అందిస్తారు.

టాటా కార్​ కొనాలా? 2024లో లాంఛ్ కానున్న 5 బెస్ట్ మోడల్స్ ఇవే!

మహిళలకు గుడ్​న్యూస్- ఆ బ్యాంక్​లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.