ETV Bharat / business

Rs 2000 Notes Exchange News : రూ.2 వేల నోట్లపై RBI కీలక ప్రకటన.. 93% నోట్లు వాపస్! - rbi september 30 deadline for 2000 notes

Rs 2000 Notes Exchange News In Telugu : రూ.2000 కరెన్సీ నోట్లు ఉపసంహరించిన తరువాత ఇప్పటి వరకు 93 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ప్రకటించింది. దీనితో ప్రస్తుతం ప్రజల వద్ద కేవలం 0.24 లక్షల కోట్లు విలువైన రూ.2000 నోట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.

93 pc of Rs 2000 currency notes returned to banks
Rs 2000 Notes Exchange News
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 4:33 PM IST

Updated : Sep 1, 2023, 5:16 PM IST

Rs 2000 Notes Exchange News : రూ.2000 కరెన్సీ నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు దాదాపు 93 శాతం వరకు రూ.2000 నోట్లు బ్యాంకుల వద్ద డిపాజిట్ అయినట్లు శుక్రవారం వెల్లడించింది.

అధికారిక డేటా ప్రకారం
RBI 2000 Notes News : బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం, 2023 ఆగస్టు 31 నాటికి, బ్యాంకులకు తిరిగి వచ్చిన రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని రిజర్వ్​ బ్యాంక్​ తెలిపింది. దీనితో ప్రస్తుతం ప్రజల వద్ద కేవలం 0.24 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.

ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, రూ.2000 డినామినేషన్​లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం వరకు డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు తిరిగి వచ్చాయి. మిగిలిన 13 శాతం నోట్లను.. ప్రజలు ఇతర డినామినేషన్​ నోట్లలోకి మార్చుకున్నట్లు ఆర్​బీఐ స్పష్టం చేసింది.

రూ.2000 నోట్ల ఉపసంహరణ
2000 Notes Withdrawn From Circulation : ఆర్​బీఐ 2023 మే 19న రూ.2000 కరెన్సీ నోట్లను చలామణిని ఉపసంహరించుకుంది. వాస్తవానికి 2023 మార్చి 31 నాటికి దేశంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉండేవి. కానీ 2023 మే 19 నాటికి దేశంలో చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షలకు తగ్గింది.

సమయం లేదు మిత్రమా!
2000 Notes Exchange Last Date : రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30. అందుకే ఈ గడువులోగా కచ్చితంగా ప్రజలందరూ.. తమ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల వద్ద జమ చేసుకోవాలని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 30 తరువాత పరిస్థితి ఏమిటి?
RBI September 30 Deadline For 2000 Notes : ఒక వేళ సెప్టెంబర్​ 30లోపు ఎవరైనా రూ.2000 నోట్లను తిరిగి బ్యాంకుల వద్ద డిపాజిట్ చేయకపోతే.. తరువాత వాటి పరిస్థితి ఏమిటి? అనే విషయంపై ఆర్​బీఐ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

నోట్​ : 2016లో డీమోనిటైజేషన్​ ప్రకటించిన ఆర్​బీఐ.. డిపాజిట్ గడవు ముగిసిన తరువాత.. ఎవరైనా రూ.500, రూ.1000 నోట్లను నిర్దిష్టపరిమితికి మించి కలిగి ఉంటే.. దానిని నేరంగా పరిగణిస్తామని స్పష్టంచేసింది.

ఆ తప్పు చేయలేదు!
2016 Demonetization Effect : 2016 నవంబర్​లో ఆర్​బీఐ హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకుంది. దీనితో ప్రజలు తమ దగ్గర ఉన్న సదరు నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, రూ.2000 నోట్లను ఉపసంహరించుకునేటప్పుడు ఆర్​బీఐ​ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మే 19న రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ.. వాటిని మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్​ 30 వరకు అంటే 4 నెలలకు పైగా ప్రజలకు సమయం ఇచ్చింది.

Last Updated : Sep 1, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.