Right Time To Invest In Real Estate : మన దేశంలో రియల్ ఎస్టేట్ ఒక మంచి లాభదాయకమైన మార్కెట్. దీన్ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇందులో ఆర్థిక భద్రత, లాభంతో పాటు మూలధన వృద్ధి కూడా దొరుకుతుంది. పెరుగుతున్న పట్టణీకరణ, అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, ఇతర కారణాల వల్ల కొన్నేళ్లుగా ఈ పరిశ్రమ మన దేశంలో గణనీయంగా అభివృద్ధి చెందుతోంది.
మరి మీరు కూడా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన సమయం.. అనేక విభిన్న అంశాలను జాగ్రత్తగా పరిశీలించడంపై ఆధారపడి ఉంటుంది. ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన క్షణాలను గుర్తించడంలో మీకు సహాయపడే కీలకమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం..
1. మార్కెట్‌పై సరైన అవగాహన కలిగి ఉండాలి
Pros And Cons Of Real Estate Investing : ఈ రంగంలో పెట్టుబడికి సరైన సమయం గురించి మాట్లాడే ముందు.. రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. మన దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వైవిధ్యతను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది నివాస, వాణిజ్య, పారిశ్రామిక మార్కెట్లుగా ఉంటుంది. ప్రతి విభాగం దాని సొంత డైనమిక్స్ కలిగి ఉండటంతో పాటు వివిధ రకాల ప్రభావాలకు లోనవుతుంది. ఫలితంగా, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న నిర్దిష్ట మార్కెట్ సెగ్మెంట్ చరిత్ర, ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా గమనించి దృష్టి పెట్టడం చాలా అవసరం.
2. మార్కెట్ సైకిల్స్, ఎకనామిక్ కండిషన్స్
రియల్ ఎస్టేట్ మార్కెట్లపై ఆర్థిక పరిస్థితులు బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వేగవంతమైన GDP వృద్ధి, పెరుగుతున్న ఉద్యోగాలు, ఈ రంగంపై వినియోగదారుల విశ్వాసం పెరగడం లాంటి అంశాలు.. ప్రభావం చూపిస్తాయి. ఆ సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటప్పడు ప్రాపర్టీ డిమాండ్ సాధారణం కన్నా ఎక్కువై.. ధరల పెరుగుదలకు దారితీయవచ్చు.
3. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు
How Government Policies Affect Real Estate Rates : ప్రభుత్వ విధానాలు, అది తీసుకునే నిర్ణణాలు, తీసుకొచ్చే సంస్కరణలు.. రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇటీవలి కాలంలో కేంద్రం తీసుకువచ్చిన పలు పథకాలు, సంస్కరణలతో ఈ రంగానికి ఊపు వచ్చింది. రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం - 2016 (RERA), వస్తువులు, సేవల పన్ను (GST), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) లాంటివి ఈ రంగాన్ని ప్రోత్సహించాయి. పెట్టుబడిదారులు ఈ పాలసీ మార్పులను నిశితంగా పరిశీలిస్తే.. మంచి లాభాలు రాబట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
4. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం
Real Estate Interest Rates 2023 : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయాన్ని నిర్ణయించాలంటే.. కచ్చితంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్ల వల్ల పెట్టుబడులు అధికమై.. దీనికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అధిక ద్రవ్యోల్బణం సమయంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ కాస్త తగ్గుతుంది. కానీ ఇలాంటి సమయంలో సదరు రియల్ ఎస్టేట్ ఆస్తులను అమ్మాల్సిన అవసరం లేదు. మళ్లీ రియల్ భూమ్ వచ్చేంతవరకు వాటిని ఆలానే పెట్టవచ్చు. దీని వల్ల కాలం గడిచిన కొద్దీ మళ్లీ ఆ ఆస్తులకు డిమాండ్, ధర రెండూ పెరుగుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధానాలు, ద్రవ్యోల్బణం రేటును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల మార్కెట్ స్థితిపై సరైన అవగాహన కలుగుతుంది.
5. సప్లై అండ్ డిమాండ్
పెట్టుబడిదారులు సప్లై అండ్ డిమాండ్ బ్యాలెన్స్‌ను జాగ్రత్తగా అంచనా వేయాలి. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో, మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో, ఉద్యోగాలను సృష్టించే ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు.. మంచి డిమాండ్ ఉంటుంది.
6. మౌలిక సౌకర్యాలు
రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై వచ్చే రాబడిని నిర్ణయించడంలో ప్రాంతం (ప్లేస్) గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. నిత్యావసర సేవలు, రవాణా కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు సమీపంలో ఉంటే.. సదరు ఆస్తులకు బాగా డిమాండ్ ఉంటుంది. అలాగే నగర ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి సామర్థ్యంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలు కూడా రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి.
7. దీర్ఘకాలిక పెట్టుబడి
Real Estate Advantages And Disadvantages : రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ను సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులుగా పరిగణించాలి. ఎందుకంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ
స్వల్పకాలిక మార్కెట్ ఒడుదొడుకులు సంభవించవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ వాస్తవ విలువ కాలక్రమేణా పెరుగుతుంది. కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడి పెడుతున్నామనే దృక్పథాన్ని అనుసరించడం మంచిది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇండియా లాంటి విశాలమైన దేశంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒకే కాలాన్ని అనుసరించి చేయలేము. ఇది పూర్తిగా ఆయా ప్రాంతాల్లో వచ్చే భూమ్ ఆధారంగా మారుతూ ఉంటుంది.
మొత్తంగా చూసుకుంటే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే.. దానికి చాలా ఓర్పు, సహనం ఉండాలి. అలాగే దీర్ఘకాలిక లాభాల కోసం.. స్వల్పకాలిక ఒడుదొడుకులు ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. మార్కెట్ పోకడలు, ఆర్థిక సూచికలు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మన వ్యాపార నిర్వహణ పంథాను మార్చుకోవాలి. అప్పుడే రియల్ ఎస్టేట్‌లో లాభాలు సాధించగలుగుతాము.
How To Reduce Credit Card Debt : క్రెడిట్ కార్డు అప్పులతో విసిగిపోయారా? రుణభారం ఇలా తగ్గించుకోండి!