ETV Bharat / business

యువ ఇంజినీర్లకు గుడ్​న్యూస్- రిలయన్స్ భారీ రిక్రూట్​మెంట్​ డ్రైవ్- దరఖాస్తు ప్రక్రియ ఇదే!

Reliance GET 2024 : యువ ఇంజినీర్లకు ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గుడ్​న్యూస్​ చెప్పింది. బీఈ, బీటెక్​ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ట్రైయినీ ఇంజినీర్ల పొజిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు మీకోసం.

Reliance GET 2024
Reliance GET 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 5:24 PM IST

Reliance GET 2024 : ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్ ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ట్యాలెంట్​ను ఒడిసిపట్టడం కోసం 'గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రెయినీ- జీఈటీ 2024' అనే రిక్రూట్​మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు రిలయన్స్​ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో, దేశ నలు మూలల నుంచి, ముఖ్యంగా చిన్న పట్టణాలు, ప్రాంతీయ విద్యా సంస్థల నుంచి వచ్చిన యువ ఇంజినీర్లకు ప్రంపంచ స్థాయి శిక్షణ, ఉపాధి అవకాశాలు విస్తరించడానికే ఈ కార్యక్రమం రూపొందించామని వెల్లడించింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా మొదటి సారి దరఖాస్తు ప్రక్రియను ఆన్​లైన్​లోకి మార్చింది. దేశంలో ప్రతి యువ ఇంజినీరింగ్ విద్యార్థికి సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో దరఖాస్తు ప్రక్రియలో ఈ మార్పు చేసినట్లు తెలిపింది.

భారత దేశంలో అసలైన ప్రతిభ, చిన్నపట్టణాలు, ప్రాంతీయ విద్యాసంస్థల్లో ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఇటీవల అన్నారు. ఆయన భావాలను అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ 'జీఈటీ 2024' కార్యక్రమం ద్వారా కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్​ట్రుమెంటేషన్​ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బీటెక్, బీఈ పూర్తి చేసిన యువ ఇంజీనర్లను రిలయన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని కోసం రిలయన్స్ సంస్థ ప్రత్యేక వెబ్​సైట్ (https://relianceget2024.in/) ​ను ప్రారంభించింది. అందులో జీఈటీ 2024 ప్రోగ్రామ్​కు సంబంధించిన అర్హత, దరఖాస్తు ప్రక్రియ గురించిన వివరాలను ఉంచింది.

ఈ జీఈటీ 2024 రిక్రూట్​మెంట్ డ్రైవ్​ నాలుగు దశల్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 11 నుంచి జనవరి 19 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. తుది ఫలితాలను మార్చి చివరి వారంలో ప్రకటిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ట్రైనీలను, రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఆర్​పీఎమ్​జీ), పెట్రోకెమికల్స్, ప్రొక్యూర్‌మెంట్ & కాంట్రాక్టింగ్, రిలయన్స్ న్యూ ఎనర్జీతో సహా వివిధ విభాగాల్లో చేర్చాలని రిలయన్స్ యోచిస్తోంది.

రిలయన్స్​ జీఈటీ - 2024 రిక్రూట్​మెంట్ డ్రైవ్

అంబానీ వారసుల 'ప్రోగ్రెస్ రిపోర్ట్'.. ఆకాశ్​, ఇషా, అనంత్​ల​లో ఎవరు బెస్ట్​? వ్యాపారంలో ఎవరిది పైచేయి?

వరల్డ్ టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్​- ముకేశ్ అంబానీ తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.