ETV Bharat / business

Raksha Bandhan Gift Ideas : మీ సోదరికి రక్షా బంధన్ కానుక ఇవ్వాలా?.. ఈ ఫైనాన్సియల్​ గిఫ్ట్స్​​ ట్రై చేయండి! - బిజినెస్​ న్యూస్​

Raksha Bandhan Gift Ideas In Telugu : రక్షా బంధన్​.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగ. ఈ సంప్రదాయ పండుగనాడు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు. దీనికి ప్రతిఫలంగా వారికి అన్నదమ్ములు అనేక కానుకలు ఇస్తారు. అయితే మీరు కూడా మీ అక్కా, చెల్లెళ్లకు మంచి కానుక ఇద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్​లో తెలిపిన ఫైనాన్సియల్​ గిఫ్ట్స్​ ఇచ్చే ప్రయత్నం చేయండి.

Raksha Bandhan financial Gifts
Raksha Bandhan Gift Ideas
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 3:38 PM IST

Updated : Aug 30, 2023, 9:12 AM IST

Raksha Bandhan Gift Ideas : అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్​ (రాఖీ పండుగ). భారతదేశంలో ఈ పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున అక్కచెల్లెళ్లు.. తమ అన్నదమ్ములకు ప్రేమతో రాఖీని కడతారు. ప్రతిఫలంగా వాళ్లకు అన్నదమ్ములు ప్రత్యేకమైన కానుకలు ఇస్తారు. అవి డబ్బులు కావచ్చు.. లేదా స్మార్ట్​ఫోన్లు, కాస్మోటిక్స్​, కొత్త దుస్తులు ఇలా ఏమైనా కావచ్చు. అయితే ఇవి ఎప్పుడూ ఇచ్చే బహుమతులే. కానీ ఈసారి ఓ సరికొత్త గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ సోదరీమణుల భవిష్యత్​ కోసం, వారి ఆర్థిక భద్రత కోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పిన ఫైనాన్సియల్ గిఫ్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి.

Best Gift Ideas Raksha Bandhan

1. క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక (సిప్​)
Systematic Investment Plan (SIP) : మ్యూచువల్​ ఫండ్స్​లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్​లో ఒక మంచి కార్పస్​ (ఆర్థిక నిధి) ఏర్పడుతుంది. ఇది మీ సోదరి ఆర్థిక భవిష్యత్​కు ఎంతో తోడ్పడుతుంది. అందుకే ఇప్పటి నుంచే మీ సోదరి పేరు మీద ఒక మంచి మ్యూచువల్​ ఫండ్​ను తీసుకొని, సిప్​ను ప్రారంభించండి.

2. ఆరోగ్య బీమా పాలసీ
Health Insurance Policy : నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉండి తీరాల్సిందే. అందుకే మీ సోదరికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా ఇప్పుడే.. ఆమె పేరు మీద మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం.

3. బ్యాంక్​ సేవింగ్స్ అకౌంట్​
Bank Savings Account : భవిష్యత్​ బంగారుమయంగా ఉండాలంటే.. పొదుపు, మదుపు తప్పనిసరి. వాస్తవానికి ఇవి ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత మంచిది. అందుకే మీరు మీ సోదరీమణుల పేరు మీద బ్యాంక్​ సేవింగ్​ అకౌంట్​ లేదా పోస్ట్ ఆఫీస్​ సేవింగ్స్ అకౌంట్​ ఓపెన్ చేయడం మంచిది.

4. డీమ్యాట్​ అకౌంట్​
Demat Account : రోజురోజుకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మన రాబడి కూడా పెరగాల్సి ఉంటుంది. ఇందుకోసం కేవలం పొదుపు చేస్తే సరిపోదు. వీలైనంత త్వరగా మదుపు చేయడం ప్రారంభించాలి. అందుకే మీ అక్క లేదా చెల్లెలు పేరు మీద డీమ్యాట్ అకౌంట్​ ఓపెన్ చేయండి. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని, మంచి క్వాలిటీ స్టాక్స్​లో దీర్ఘకాలంపాటు పెట్టుబడి కొనసాగించేలా వారిని ప్రోత్సహించండి. ఇది వారి భవిష్యత్​కు బాగా ఉపయోగపడుతుంది.

నోట్ : స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్​మెంట్స్ బాగా రిస్క్​తో కూడుకున్నవి. కనుక ఆర్థిక నిపుణుల సలహాలు తప్పనిసరి.

5. డిజిటల్ గోల్డ్ :
Digital Gold : రాఖీ పండగ పూట సోదరులు.. తమ అక్కచెల్లెళ్లకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం మామూలే. కానీ నేటి కాలంలో డిజిటల్ గోల్డ్​ను కూడా గిఫ్ట్​గా ఇచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు దీనిని కూడా ప్రయత్నించవచ్చు.

6. గోల్డ్ ఈటీఎఫ్​లు
Gold ETFs : అన్నదమ్ములు.. తమ సిస్టర్స్​ పేరు మీద ఈటీఎఫ్​ లేదా గోల్డ్ సేవింగ్స్ ఖాతాల ద్వారా పేపర్​ గోల్డ్​లోనూ పెట్టుబడి పెట్టవచ్చు.

7. డెట్​ ఇన్​స్ట్రుమెంట్స్​
Debt Instruments : డెట్ ఫండ్స్​లో.. లిక్విడిటీ, భద్రత, క్రమమైన ఆదాయం లభిస్తాయి. ముఖ్యంగా డెట్​ పథకాల్లోని పెట్టుబడులకు రిస్క్ కాస్త తక్కువ. అందుకే డెట్​ పథకాలైన.. గ్రీన్​ ఫిక్స్​డ్ డిపాజిట్స్​ (ఎఫ్​డీ) లేదా రికరింగ్​ డిపాజిట్స్​లో.. మీ సోదరీమణుల పేరు మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది.

8. 'రియల్' కానుకలు :
మీ అక్కచెల్లెళ్లకు.. ఇళ్లు, స్థలాలు, పొలాలు లాంటి బహుమతులు కూడా ఇవ్వవచ్చు. ఇవి కూడా వారికి ఆర్థిక భద్రతను, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పిస్తాయి.

రక్షా బంధన్​ (రాఖీ పండుగ) ఎప్పుడు?
2023 సంవత్సరంలో రాఖీ పండుగ తేదీ గురించి చిన్న కన్​ప్యూజన్​ ఉంది. ఆగస్టు 30న రాఖీ పండుగ అని కొందరు.. లేదూ ఆగస్టు 31న రక్షా బంధన్ అని మరికొందరు అంటున్నారు. పండుగ ఎప్పుడైతే ఏమిటి? అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రెండు రోజుల్లోనూ రాఖీ పండుగను హాయిగా జరుపుకోండి.

Last Updated : Aug 30, 2023, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.