ETV Bharat / business

New Electric Bike In India : స్టన్నింగ్​ ఫీచర్స్​తో టోర్క్​ మోటార్స్​ ఈ-బైక్​ లాంఛ్​.. ధర ఎంతంటే? - latest bikes 2023 August

New Electric Bike In India : ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'టోర్క్ మోటార్స్'​ ఇండియన్​ మార్కెట్​లో సరికొత్త ఈ-బైక్​ను విడుదల చేసింది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ-బైక్​ ధర, ఫీచర్స్​, కలర్ వేరియంట్స్​ తదితర పూర్తి వివరాలు మీ కోసం..

New Electric Bike In India Tork Motors Launches Kratos-R Urban Trim In India Full Details Here
Tork Motors New Bike Kratos R Urban Trim
author img

By

Published : Aug 14, 2023, 3:09 PM IST

New Electric Bike In India : విద్యుత్​ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'టోర్క్ మోటార్స్' (Tork Kratos R Urban Trim) భారత విపణిలో సరికొత్త ఈ-బైక్​ను విడుదల చేసింది. 'క్రాటోస్​-ఆర్​ అర్బన్​ ట్రిమ్'​​ పేరుతో ఈ వేరియంట్​ను ఇటీవలే లాంఛ్​ చేశారు. రోజువారీ రైడ్‌లను ఆస్వాదించే సిటీ రైడర్​ల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడల్​ పనితీరుకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు తయారీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని చెప్పింది. కాగా, దీనికి సంబంధించిన విక్రయాలను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ కపిల్ షెల్కే వెల్లడించారు.

"మేము కొత్తగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు.. మా వినియోగదారుల రైడింగ్ స్టైల్​తో పాటు, బైక్​ వినియోగ విధానంలోనూ గొప్ప వేరియేషన్లను మేము గమనించాము. ఇందుకు తగ్గట్లే మా సరికొత్త ఈ-బైక్​ను తీర్చిదిద్దాము. ఈ అర్బన్​ ట్రిమ్​ మోడల్​ తయారీలో మేము ఏ మాత్రం రాజీపడలేదు. అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే దీనిని అందిస్తున్నాము. డైలీ రైడ్​ను ఆస్వాదించే రైడర్​ అవసరాలను, అభిరుచులను నెరవేర్చే విధంగా దీనిని తయారు చేశాము."

- కపిల్ షెల్కే, టోర్క్ మోటార్స్​ సీఈఓ

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న Kratos-R తరువాతి వెర్షన్​ Tork Kratos R Urban. అర్బన్ ట్రిమ్ రోజువారీ సిటీ ట్రావెల్​ను ఆస్వాదించేందుకు అనువైన ఫీచర్లతో రూపొందించారు. ఈ వేరియంట్​లో హోమ్ ఛార్జింగ్ సెటప్‌ను కూడా అమర్చారు. అయితే బైక్​ లుక్​, పవర్‌ట్రెయిన్ విషయాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

ఫీచర్స్​ ఇవే..

  • ఈ బైక్​ను ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వరకు.. గంటకు 70 కి.మీల వేగంతో ప్రయాణించవచ్చు.
  • మిడ్‌నైట్ బ్లాక్​, స్ట్రీకీ రెడ్, ఓషనిక్ బ్లూ అనే మూడు కలర్స్​ వేరియంట్స్​తో ఈ బైక్​ను తీసుకొచ్చారు.
  • ఈ మోటార్‌సైకిల్‌లో 4.0 kWh Li-ion (IP 67 Rated​) బ్యాటరీని వినియోగించారు.
  • ఇటీవలే పేటెంట్​ హక్కులు దక్కించుకున్న 'యాక్సియల్​ ఫక్స్ మోటార్​'ను ఇందులో వాడారు. ఈ మోటార్​ 96 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

New Electric Scooter 2023 : ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (Tork Motors New Bike)​లో మల్టీ-రైడ్ మోడ్‌లు (ఎకో, సిటీ, స్పోర్ట్స్), రివర్స్ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్​-యాప్‌ నావిగేషన్, బ్లూటూత్ ద్వారా లైవ్ డాష్, ట్రాక్ మోడ్ అనలిటిక్స్, స్మార్ట్ అనలిటిక్స్​, గైడ్ మీ హోమ్ లైట్లు లాంటి సూపర్​ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్‌లను మొదటి 30 రోజులపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే తరువాత కూడా ఈ ఫీచర్లను ఉపయోగించుకోవాలంటే.. వినియోగదారులు బైక్​ కొనుగోలు చేసిన ఆరు నెలలలోపు రూ.20,000 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి Tork Kratos R Urban Trimను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఈ కొత్త Kratos-R అర్బన్ ట్రిమ్ వేరియంట్‌ ధరను రూ.1.67 లక్షలు (New EV Bike Price)గా నిర్ణయించింది. దీనికి సంబంధించిన బుకింగ్​లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. తమ వెబ్​సైట్​లో కేవలం రూ.999లు చెల్లించి ఈ-బైక్​ను బుక్​​ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే అదే రోజు దేశంలోని అన్ని టార్క్​ షోరూంల్లో కూడా ఈ బైక్​ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.