ETV Bharat / business

LIC Jeevan Umang Policy : ఈ ఎల్​ఐసీ పాలసీతో.. 100 ఏళ్ల వరకు పెన్షన్​ గ్యారెంటీ.. కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా.. - ఎల్​ఐసీ జీవన్​ ఉమంగ్​ పాలసీ అర్హతలు

LIC Jeevan Umang Policy : ఎల్​ఐసీ అందిస్తున్న సూపర్​ పాలసీల్లో 'జీవన్​ ఉమంగ్​ పాలసీ' ఒకటి. వ్యక్తిగతంగానే కాకుండా మొత్తం కుటుంబానికి ఆదాయం, ఆర్థిక భద్రతను అందించే పెన్షన్​ ప్లాన్​ ఇది. మరి ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

LIC Jeevan Umang Policy Full Details Here In Telugu
LIC Jeevan Umang Policy Details
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 3:08 PM IST

LIC Jeevan Umang Policy : ప్రముఖ బీమా కంపెనీ లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా​(ఎల్​ఐసీ) ఎప్పటికప్పుడు సరికొత్త ఇన్సూరెన్స్​ ప్లాన్స్​తో తమ వినియోగదారుల ముందుకు వస్తుంటుంది. వారి భవిష్యత్​ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరీ రకరకాల ప్లాన్స్​ను మార్కెట్​లో ప్రవేశపెడుతుంటుంది. ఇందులో భాగంగా తీసుకువచ్చిన ఎల్​ఐసీ పాలసీల్లో 'జీవన్​ ఉమంగ్ పాలసీ' ఒకటి. దీని కింద కేవలం పాలసీదారు మాత్రమే కాకుండా పూర్తి కుటుంబం ఆదాయం, ఆర్థిక లబ్ధి పొందవచ్చు. ఈ ప్లాన్​ ద్వారా వచ్చే మొత్తంతో మీ పిల్లల చదువులు సహా ఇతర ఆర్థిక అవసరాలనూ తీర్చుకోవచ్చు. మరి ఈ ప్లాన్​ను తీసుకోవాలంటే కావాల్సిన అర్హతలు, విధివిధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవన్​ ఉమంగ్ పాలసీ అంటే ఏమిటి?
What Is LIC Jeevan Umang Policy : జీవన్ ఉమంగ్​ పాలసీ అనేది ఒక నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్​, పెన్షన్​ ప్లాన్​. ఈ పాలసీ కింద మీకు కచ్చితమైన రిటర్న్స్ లభిస్తాయి. అంటే మీరు మరణించేంతవరకు ప్రతిఏడాది మీకు పెన్షన్​ అందుతుంటుంది. ఒకవేళ పాలసీదారు ప్లాన్​ కొనుగోలు చేసిన తర్వాత తొలి అయిదేళ్లలోనే మరణిస్తే పాలసీ హామీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది ఎల్​ఐసీ. అదే అయిదేళ్ల తర్వాత మరణిస్తే హమీ మొత్తంతో పాటు లాయల్టీ బోనస్​ను కూడా అందిస్తుంది. ఈ పాలసీ​ కింద కనీస సమ్​ అష్యూర్డ్​ను రూ.2 లక్షలుగా ఫిక్స్​ చేశారు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమి లేదు.

కావాల్సిన అర్హతలు!
LIC Jeevan Umang Plan Eligibility : ఈ జీవన్​ ఉమంగ్​ పాలసీని తీసుకునేందుకు కనీస అర్హత వయస్సు 90 రోజులు. గరిష్ఠ వయోపరిమితి 55 సంవత్సరాలుగా ఉంది. ఈ ప్లాన్​​లో నాలుగు ప్రీమియం టర్మ్స్​ ఉన్నాయి. అవి: 15, 20, 25, 30 ఏళ్లు.

ఇవీ ప్రయోజనాలు!
LIC Jeevan Umang Policy Benefits : ఈ స్కీమ్​ కింద వచ్చే యానువల్​ సర్వైవల్​ బెనిఫిట్స్​ అనేవి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. ఇలా ఈ బెనిఫిట్స్ ప్లాన్​ మెచ్యురిటీ ముగిసే వరకు కొనసాగుతాయి. అంటే పాలసీదారునికి ప్రతి ఏడాది నిర్దిష్టమైన మొత్తంలో పెన్షన్ అందుతుంది. అలాగే ఒకవేళ మెచ్యురిటీ సమయానికి లేదా పాలసీ మధ్యలో పాలసీదారు మరణిస్తే గనుక అతని లేదా ఆమె కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో మెచ్యూరిటీ అమౌంట్​ అందుతుంది.

ఎల్ఐసీ జీవన్​ ఉమాంగ్​ ప్లాన్​ ప్రకారం, బీమా మొత్తంలో ఎనిమిది శాతం సొమ్మును ఏటా పెన్షన్ కింద చెల్లిస్తుంది ఎల్​ఐసీ. మీకు 99 ఏళ్ల నిండే వరకు ఇలానే ప్రతి ఏడాది మీకు డబ్బులు వస్తాయి. వాస్తవానికి 99 ఏళ్లు పూర్తికాగానే మీకు ఎఫ్ఏబీ, బోనస్, బీమా మొత్తం.. ఇవన్నీ కలుపుకొని మెచ్యూరిటీ కింద భారీ మొత్తం లభిస్తుంది. అలాగే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా మధ్యలో ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు లోన్​ సౌకర్యం కూడా ఉంటుంది.

LIC Jeevan Umang Plan Calculator : ఉదాహరణకు.. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే సమయానికి పాలసీదారు 70 ఏళ్లు ఉంటే ఆ వ్యక్తికి 100 ఏళ్లు వచ్చే వరకు యానువల్​ బెనిఫిట్స్​ను పొందుతాడు. ఒకవేళ 100 ఏళ్ల లోపు మృతి చెందితే నామినీకి ఏకమొత్తంలో డబ్బును చెల్లిస్తారు. అలాగే పాలసీదారు 25 ఏళ్ల వయస్సులో రూ.5 లక్షల హామీ మొత్తంతో 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే.. ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం రూ.14,758 ప్రీమియం చొప్పున 55 ఏళ్ల వయస్సు వరకు చెల్లించాలి. అక్కడి నుంచి అతడికి 100 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏటా పెన్షన్​ అందుతుంది. అప్పటికీ జీవించి ఉంటే హామీ మొత్తం, ప్రయోజనాలు కలిపి సుమారు రూ.63 లక్షల వరకు రావచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.