ETV Bharat / business

సూపర్ ఫీచర్లతో 2024 కియా సోనెట్‌ మోడల్​- ధర ఎంతో తెలుసా?

Kia Sonet 2024 Features And Price : ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా సోనెట్‌ మోడల్‌ కార్లను మరింత నూతనంగా తీర్చిదిద్దింది. ఈ సోనెట్ మోటల్ కారు ప్రారంభ ధర రూ.799000 కాగా గరిష్ఠ ధర 15లక్షల 69వేల రూపాయలు. మరి కియా సోనెట్ 2024 మోడల్ కార్ల ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Kia Sonet 2024 Features And Price
Kia Sonet 2024 Features And Price
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 9:40 PM IST

Kia Sonet 2024 Features And Price : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మరో 2024 కియా సోనెట్ మోడల్​ను లాంఛ్ చేసింది. మార్కెట్లోకి విడుదల చేసిన ఈ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌ ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు ఎక్స్​షోరూం ప్రారంభ ధర రూ. 7,99000గా ఉంది. వివిధ ఇంజిన్, ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లతో మొత్తం 19 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 2024 కియా సోనెట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

2024 కియా సోనెట్ మోడల్ కొత్తగా కనిపిస్తోంది. కొత్త లైట్లతో డీఆర్​ఎల్​​లను రీడిజైన్​ చేశారు. గ్రిల్​ అప్డేట్​ చేశారు. ఇక ముందు, వెనుక బంపర్లకు కూడా కొత్త లుక్​ ఇచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన అలాయ్ వీల్స్​ కియా సెల్​టాస్ మోడల్​ను పోలి ఉన్నాయి. ఇక ఇంటీరియర్ విషయంలో పెద్దగా మార్పులు లేకపోయినా, మరికొన్ని ఫీచర్లు యాడ్ చేశారు.

ఇంటీరియర్​ ఫీచర్లలో LED యాంబియంట్ సౌండ్ లైటింగ్, BOSE ప్రీమియం 7 స్పీకర్ సిస్టమ్, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేసిన ప్యానెల్ డిజైన్, క్లస్టర్‌పై బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, వెనుక తలుపు సన్‌షేడ్ కర్టెన్ ఉన్నాయి. విండో వన్ టచ్ అప్/డౌన్, వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షించేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్, 4 వే పవర్డ్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి.

ADAS లెవల్ 1 ఫీచర్లు:

  • ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ (FCW)
  • పాదచారులను ఢీకొట్టే ముందు ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్
  • ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ సైక్లిస్ట్ (FCA-సైక్లిస్ట్)
  • ఫ్రంట్ కొలిజన్ ఆవాయిడెన్స్ అసిస్ట్ కారు(FCA-కారు)
  • లీడింగ్ వెహికల్ డిపార్ట్యూర్ అలర్ట్- (LVDA)
  • లేన్ డిపార్ట్యూర్ వార్నింగ్​- (LDW)
  • లేన్ కీప్ అసిస్ట్- (LKA)
  • లేన్ ఫాలోయింగ్ అసిస్ట్- (LFA)
  • హై బీమ్ అసిస్ట్- (HBA)
  • డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్- (DAW)

భద్రతా ఫీచర్లు:

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
  • వెహితల్​ స్టెబిలిటీ మేనేజమెంట్​ (VSM)
  • హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC)
  • ఫ్రంట్​ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • ఫ్రంట్ సీట్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ABS)
  • బ్రేక్-ఫోర్స్ అసిస్ట్ సిస్టమ్ (BAS)
  • పార్కింగ్ సెన్సార్లు
  • ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS)
  • హైలైన్ టైర్ ప్రెజర్ మానిటర్
  • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
  • ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్
  • 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు (అన్ని సీట్లకు)
  • సీట్ బెల్ట్ రిమైండర్ (అన్ని సీట్లకు)

ఇంజిన్ ఆప్షన్లు :
⦁ ఈ కారు ఇంజిన్​ ఆప్షన్లలో మార్పు లేదు. కానీ కియా ఇప్పుడు డీజిల్​ ఇంజిన్​లో 6-​ స్పీడ్​ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్​ను తీసుకొచ్చింది.
⦁ ఇక ఎంట్రీ లెవెల్ కార్లలో లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో 83 హెచ్​పీ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్​ ఆప్షన్ ఉంది.
⦁ 120 హెచ్​పీ 1 లీటర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇందులో ఇది ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్​మిషన్ అప్షన్లు ఉన్నాయి.
⦁ 116 హెచ్​పీ 1.5 డీజిల్ ఇంజిన్. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్, 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

Mg Astor 2024 Launch : అంతర్జాతీయ కార్ల కంపెనీ ఎంజీ మరో కొత్త కారును విపణిలోకి తీసుకొచ్చింది. అధునాతన సౌకర్యాలతో కూడిన ఆస్టర్ కారును మార్కెట్‌లో విడుదల చేశారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఎంజీ కారు షోరూంలో కారును నిర్వాహకులు విడుదల చేశారు. 100ఏళ్ల చరిత్ర కలిగిన ఎంజీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్లు మార్కెట్‌లో ఉన్నాయని వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కార్లలో ఫీచర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

mg astor 2024 price
ఎంజీ ఆస్టర్ కారు లాంఛ్
mg astor 2024 price
ఎంజీ ఆస్టర్ కారు

ఇండియాలో 158 నగరాల్లో 350 షోరూలున్నాయని, రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడితో గుజరాత్‌లో కార్ల తయారీ ప్లాంటు ఉందని నిర్వాహకులు వెల్లడించారు. మొదటి ఈవీ కారు సైతం ఎంజీ కంపెనీ నుంచే విడుదలైందని ఈవీ కార్లు ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంపెనీలో ఇప్పటికే 37శాతం మంది మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని దీన్ని 50శాతం వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసుకుందని నిర్వాహకులు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, బాలిక విద్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వాహనప్రియులను ఆకట్టుకునేలా సరసమైన ధరలోనే ఆస్టర్ నూతన వాహనం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.